Share News

Jamili Elections: జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి నివేదిక అందజేసిన కోవింద్ కమిటీ

ABN , Publish Date - Mar 14 , 2024 | 12:46 PM

న్యూఢిల్లీ: ఒకే దేశం -ఒకే ఎన్నిక (జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్య సాధ్యాల)పై బారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ అధ్యాయనం పూర్తి అయింది. ఈ కమిటీ తుది నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కోవింద్ అందజేశారు.

Jamili Elections: జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి నివేదిక అందజేసిన కోవింద్ కమిటీ

న్యూఢిల్లీ: ఒక దేశం -ఒకే ఎన్నిక (One country - one Election) (జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్య సాధ్యాల)పై భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (Ram Nath Kovind) నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ అధ్యాయనం పూర్తి అయింది. ఈ కమిటీ తుది నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu)కు కోవింద్ అందజేశారు. 2029లో దేశంలో జమిలి ఎన్నికలు (Jamili Elections) సాధ్యమేనంటూ కోవింద్ కమిటీ (Kovind Committee) నివేదికలో పేర్కొంది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) పాల్గొన్నారు. దేశంలో ఒకేసారి ఎన్నికలతో ఎన్నో ప్రయోజనాలున్నాయని కమిటీ పేర్కొంది. ఒకేసారి ఎన్నికల కోసం కోవింద్ కమిటీ నిర్దిష్ట సిఫార్సులు చేసింది.

లోక్ సభ (Lok Sabha), అసెంబ్లీ (Assembly)ల ఎన్నికలు ఒకసారి, మిగిలిన స్థానిక సంస్ధల ఎన్నికలను మరోసారి నిర్వహిస్తే సముచితంగా ఉంటుందని కోవింద్ కమిటీ పేర్కొంది. కాగా పలు కీలక సిఫార్సులతో ఒకే దేశం.. ఒకే ఎన్నికపై ఇవాళ రామ్ నాథ్ కోవింద్ కమిటి నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసింది. విస్తృత సంప్రదింపులు, సమావేశాలు, అభిప్రాయ సేకరణ అనంతరం ఎనిమిది భాగాలుగా 18 వేల పేజీలతో నివేదికను కోవింద్ కమిటీ రూపొందించింది.

Updated Date - Mar 14 , 2024 | 01:38 PM