Share News

Modi Cabinet 3.0 : మోదీ క్యాబినెట్‌లో ఆ కీలక పదవులు మళ్లీ బీజేపీకే.. ప్రధాని వద్దే మరిన్ని కీలక శాఖలు

ABN , Publish Date - Jun 10 , 2024 | 09:29 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3.0 సర్కార్ కొలువుల్లో కీలక పదవులు మళ్లీ బీజేపీ సీనియర్ నేతలనే వరించాయి. ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు తగిన రీతిలో శాఖలను కేటాయించారు. బీజేపీ తిరిగి నిలబెట్టుకున్న కీలక శాఖల్లో హోం శాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, రోడ్డు రవాణా శాఖ, ఆర్థిక శాఖ ఉన్నాయి.

Modi Cabinet 3.0 : మోదీ క్యాబినెట్‌లో ఆ కీలక పదవులు మళ్లీ బీజేపీకే.. ప్రధాని వద్దే మరిన్ని కీలక శాఖలు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3.0 సర్కార్ (Modi Cabinet 3.0) కొలువుల్లో కీలక పదవులు మళ్లీ బీజేపీ సీనియర్ నేతలనే వరించాయి. ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు తగిన రీతిలో శాఖలను కేటాయించారు. బీజేపీ తిరిగి నిలబెట్టుకున్న కీలక శాఖల్లో హోం శాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, రోడ్డు రవాణా శాఖ, ఆర్థిక శాఖ ఉన్నాయి. హోం శాఖను తిరిగి అమిత్‌షా నిలబెట్టుకోగా, రాజ్‌నాథ్ సింగ్ రక్షణ శాఖను, ఎస్.జైశంకర్ విదేశాంగ శాఖను, నితిన్ గడ్కరి రోడ్డు, రవాణా శాఖను, నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖను తిరిగి దక్కించుకున్నారు. తద్వారా దాదాపు గత ఎన్డీయే ప్రభుత్వ లైన్స్‌కు కొనసాగింపుగానే ఈసారి శాఖల కేటాయింపు జరిగింది.


ప్రధాని చేతిలో..

అధికారిక సమాచారం ప్రకారం, ప్రధాన మంత్రి చేతిలో సిబ్బంది- ప్రజా సమస్యలు-పెన్షన్లు, ఆటమిక్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ (డీఓఎస్), కీలక విధాన అంశాలు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు ఉన్నాయి. మొత్తంగా, మోదీ క్యాబినెట్‌లో 30 మంది క్యాబినెట్ హోదా మంత్రులు, ఐదుగురు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు, 36 సహాయ మంత్రులకు చోటు కల్పించారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Jun 10 , 2024 | 09:29 PM