Share News

Maliwal Assault case: బిభవ్ కుమార్‌కు నాలుగు రోజుల జ్యుడిషియల్ కస్టడీ

ABN , Publish Date - May 24 , 2024 | 04:51 PM

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్‌ కు తీస్ హజారీ కోర్టు నాలుగు రోజుల జ్యుడిషియల్ కస్టడీకి శుక్రవారంనాడు ఆదేశించింది.

Maliwal Assault case: బిభవ్ కుమార్‌కు నాలుగు రోజుల జ్యుడిషియల్ కస్టడీ

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ (Swati Maliwal)పై దాడి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్‌ (Bibhav Kuamar)కు తీస్ హజారీ కోర్టు నాలుగు రోజుల జ్యుడిషియల్ కస్టడీకి శుక్రవారంనాడు ఆదేశించింది. గత శనివారంనాడు సీఎం నివాసం నుంచి అరెస్టు చేసిన బిభవ్ కుమార్‌కు ఐదురోజుల పోలీసు కస్టడీ విధించగా, అది ఈరోజుతో ముగిసింది. దీంతో ఆయనను కోర్టు ముందు ఢిల్లీ పోలీసులు హాజరుపరిచారు.


సీసీటీవీ ఫుటేజ్‌ను, డీవీఆర్‌ను పదిలపరచాలని కోరుతూ బిభవ్ తరఫు లాయర్‌ కోర్టులో పిటిషన్ వేశారు. బిభవ్ పిటిషన్‌ను ఢిల్లీ పోలీసులు వ్యతిరేకిస్తూ, విచారణ ఇంకా మొదలుకాలేనందున ఆ డిమాండ్‌లో అర్ధం లేదని కోర్టుకు తెలిపింది.

Fake birth certificate case: ఆజంఖాన్‌కు ఉపశమనం, ఏడేళ్ల జైలుశిక్షపై కోర్టు స్టే..


కాగా, దీనికి ముందు బిభవ్ కుమార్‌ను ముంబై నుంచి పోలీసులు తిరిగి ఢిల్లీకి తీసుకువచ్చారు. బిభవ్ కుమార్ తన అరెస్టుకు ముందు ఐఫోన్‌ను ఫార్మెట్ చేశాడనే ఆరోపణపై ఆయనను ముంబై తీసుకువెళ్లారు. బిభవ్ తన ఐఫోన్‌లోని డాటాను ముంబైలోని అజ్ఞాత వ్యక్తికి, లేదా ఫోన్‌కు ట్రాన్స్‌ఫర్ చేసి ఆ తర్వాత ఫార్మెట్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేజ్రీవాల్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న బిభవ్ కుమార్ ఫోన్లు, ల్యాప్ టాప్, సీసీటీవీ రికార్డింగ్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. దీనికితోడు దాడికి పాల్పడినట్టు చెబుతున్న ప్రదేశానికి బిభవ్‌ను పోలీసులు తీసుకువెళ్లి సుమారు 20 మంది వ్యక్తుల స్టేట్‌మెంట్లను రికార్డు చేసినట్టు తెలుస్తోంది. అవసరమైతే ముఖ్యమంత్రిని, ఆయన కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్లను కూడా రికార్డు చేయాలని అనుకుంటున్నారు.

Read Latest News and National News here

Updated Date - May 24 , 2024 | 04:52 PM