Share News

Video: కేజీల కొద్ది బంగారం, వెండి, రూ.5.6 కోట్ల క్యాష్ పట్టివేత

ABN , Publish Date - Apr 08 , 2024 | 06:36 AM

లోక్‌సభ ఎన్నికల వేళ పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కర్ణాటక(Karnataka)లోని బళ్లారి(Ballari)లో తనిఖీల్లో భాగంగా పెద్ద ఎత్తున గోల్డ్, వెండితోపాటు నగదు కూడా లభ్యమైంది.

 Video: కేజీల కొద్ది బంగారం, వెండి, రూ.5.6 కోట్ల క్యాష్ పట్టివేత

లోక్‌సభ ఎన్నికల(lok sabha election 2024) వేళ పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కర్ణాటక(Karnataka)లోని బళ్లారి(Ballari)లో తనిఖీల్లో భాగంగా పెద్ద ఎత్తున గోల్డ్, వెండితోపాటు నగదు కూడా లభ్యమైంది. వాటిలో 3 కిలోల గోల్డ్, 68 కేజీల వెండి, 103 కిలోల వెండి ఆభరణాలతోపాటు పత్రాలు లేని రూ.5.6 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం(Police seized) చేసుకున్నారు.


అయితే కారు(car)లో డబ్బు తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు(police) ఈ దాడులు నిర్వహించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బ్రూస్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వీటిని పట్టుకున్నారు. ఈ ఘటనలో ఓ జ్యువెలర్స్ యజమాని నరేష్ సోనీని అరెస్టు చేసినట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రంజిత్ కుమార్ బండారు తెలిపారు. పోలీసులు హవాలా లింక్‌ కోణంలో కూడా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


ఇది కూడా చదవండి:

ఈసారి బీజేపీకి 300కు పైగా

జేపీ నడ్డా సతీమణి కారు చోరీ కేసులో ఇద్దరి అరెస్టుమరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 08 , 2024 | 06:39 AM