Share News

Kamala Haasan: తేల్చిచెప్పేశారు.. ఎన్నికల పొత్తుపై రెండు రోజుల్లో నిర్ణయం..

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:13 AM

లోక్‌సభ ఎన్నికల్లో ఏ కూటమితో పొత్తుకుదుర్చుకోవాలనే విషయమై రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని మక్కల్‌ నీదిమయ్యం అధ్యక్షుడు కమలహాసన్‌(Kamala Haasan) తెలిపారు.

Kamala Haasan: తేల్చిచెప్పేశారు.. ఎన్నికల పొత్తుపై రెండు రోజుల్లో నిర్ణయం..

- కమలహాసన్‌ ప్రకటన

చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో ఏ కూటమితో పొత్తుకుదుర్చుకోవాలనే విషయమై రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని మక్కల్‌ నీదిమయ్యం అధ్యక్షుడు కమలహాసన్‌(Kamala Haasan) తెలిపారు. అమెరికా పర్యటనను ముగించుకుని ఆయన సోమవారం ఉదయం చెన్నైకి తిరిగొచ్చారు. విమానాశ్రయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘థగ్‌లైఫ్‌’ సినిమా షూటింగ్‌ ముందస్తు ఏర్పాట్లు చేపట్టేందుకే అమెరికాకు వెళ్లానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రెండు రోజుల్లో పొత్తుకు సంబంధించిన గుడ్‌న్యూస్‌ చెబుతానని ఆయన తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు తమ పార్టీ ఎప్పుడో సిద్ధమైందని, జిల్లా శాఖ నాయకులంతా ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా ఉన్నారని చెప్పారు. తమ పార్టీ ఏడో వార్షిక ఉత్సవాలు ఈ నెల 21న ఆళ్వార్‌పేటలోని పార్టీ కార్యాలయం జరగనున్నాయని ఆయన చెప్పారు. ఈ వేడుకల్లో పార్టీ ప్రముఖులు, జిల్లా నేతలు అందరూ పాల్గొంటారని చెప్పారు.

Updated Date - Feb 20 , 2024 | 11:14 AM