Share News

Delhi: ఝార్ఖండ్‌ మంత్రి ఆలంగీర్‌ అరెస్టు..

ABN , Publish Date - May 16 , 2024 | 03:21 AM

ఝార్ఖండ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్‌ నేత ఆలంగీర్‌ ఆలమ్‌(70)ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మనీలాండరింగ్‌ కేసులో బుధవారం అరెస్టు చేసింది. ఆలంగీర్‌ ఆలమ్‌ పర్సనల్‌ సెక్రటరీ(పీఎస్‌) సంజీవ్‌ లాల్‌ పని మనిషి జహంగీర్‌ ఆలమ్‌ ఇంట్లో రూ.35.23 కోట్లు దొరికిన కేసులో ఈడీ చర్యలు తీసుకుంది. ఆలంగీర్‌ ఆలమ్‌ను బుధవారం వరుసగా రెండో రోజు విచారణకు పిలిచిన ఈడీ ఆయన్ను అరెస్టు చేసినట్టు ప్రకటించింది.

Delhi: ఝార్ఖండ్‌ మంత్రి ఆలంగీర్‌ అరెస్టు..

న్యూఢిల్లీ, మే 15 : ఝార్ఖండ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్‌ నేత ఆలంగీర్‌ ఆలమ్‌(70)ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మనీలాండరింగ్‌ కేసులో బుధవారం అరెస్టు చేసింది. ఆలంగీర్‌ ఆలమ్‌ పర్సనల్‌ సెక్రటరీ(పీఎస్‌) సంజీవ్‌ లాల్‌ పని మనిషి జహంగీర్‌ ఆలమ్‌ ఇంట్లో రూ.35.23 కోట్లు దొరికిన కేసులో ఈడీ చర్యలు తీసుకుంది. ఆలంగీర్‌ ఆలమ్‌ను బుధవారం వరుసగా రెండో రోజు విచారణకు పిలిచిన ఈడీ ఆయన్ను అరెస్టు చేసినట్టు ప్రకటించింది. ఈడీ అధికారులు జహంగీర్‌ ఆలమ్‌ ఇంట్లో గత వారం రూ.35.23 కోట్లు గుర్తించి సీజ్‌ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే అరెస్ట్‌ అయిన సంజీవ్‌ లాల్‌, జహంగీర్‌ ఆలమ్‌ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు.

Updated Date - May 16 , 2024 | 03:23 AM