Share News

PM Modi: త్వరలో జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు

ABN , Publish Date - Apr 12 , 2024 | 01:04 PM

జమ్ము కశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదా కల్పిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉదంపూర్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

PM Modi: త్వరలో జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు

శ్రీనగర్, ఏప్రిల్ 12: జమ్ము కశ్మీర్‌ కు త్వరలో రాష్ట్ర హోదా కల్పిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉదంపూర్‌ (Udhampur)లో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ.. జమ్ము కశ్మీర్‌‌ (Jammu and Kashmir) అద్బుత రాష్ట్రంగా మలిచే పనిలో బిజీగా ఉన్నానన్నారు. త్వరలో రాష్ట్ర హోదా పొందుతుందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎంతో దూరం లేదని చెప్పారు. ఈ ఎన్నికల అనంతరం మీరు కన్న కలలు.. మీ ఎమ్మెల్యేలు, మంత్రులతో పంచుకోవచ్చున్నారన్నారు.

Special trains: వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే...

జమ్ము కశ్మీర్‌లో ఎంతో కాలంగా ప్రజలు పడుతోన్న ఇబ్బందులు తాను ఇస్తున్న హామీలతో తొలిగిపోనున్నాయని తెలిపారు. అయితే జమ్ము కశ్మీర్‌లో మళ్లీ అర్టికల్ 370 (Article 370)ని ప్రతిపక్షాలు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఈ సందర్బంగా మోదీ ఆరోపించారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పడేంందుకు ఈ ఎన్నికలు దోహదం చేస్తాయని ప్రజలు సూచించారు.

Actress Radhika: ఎన్నికల ప్రచారంలో.. నటి రాధిక నోట తెలుగు పలుకులు..


ఉదంపూర్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా జితేందర్ సింగ్ (Jitendra Singh), జమ్ము (Jammu) నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా జుగల్ కిషోర్ (Jugal Kishore) ఎన్నికల బరిలో నిలిచారు. వారి తరపున మోదీ ప్రచారం నిర్వహించారు. అయితే 2019, ఆగస్టులో జమ్ము కాశ్మీర్‌లో అమలులో ఉన్న ఆర్టికల్ 370ని ఈ మోదీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం విధితమే. ఏప్రిల్ 19వ తేదీ ఉదంపూర్ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

జాతీయ వార్తలు కోసం...

Updated Date - Apr 12 , 2024 | 01:08 PM