Share News

West Bengal: జైళ్లల్లోని మహిళా ఖైదీలకు గర్భం.. ఆ చర్యలకు అధికారుల నిర్ణయం..

ABN , Publish Date - Feb 09 , 2024 | 11:42 AM

పశ్చిమ బెంగాల్‌లోని జైళ్లలో కస్టడీలో ఉన్న మహిళా ఖైదీలు గర్భం దాల్చినట్లు తేలింది. అంతే కాకుండా జైళ్లలో కనీసం 196 మంది శిశువులు జన్మించారని గుర్తించింది. ఈ మేరకు కలకత్తా హైకోర్టు నియమించిన సహాయకుడు

West Bengal: జైళ్లల్లోని మహిళా ఖైదీలకు గర్భం.. ఆ చర్యలకు అధికారుల నిర్ణయం..

పశ్చిమ బెంగాల్‌లోని జైళ్లలో కస్టడీలో ఉన్న మహిళా ఖైదీలు గర్భం దాల్చినట్లు తేలింది. అంతే కాకుండా జైళ్లలో కనీసం 196 మంది శిశువులు జన్మించారని గుర్తించింది. ఈ మేరకు కలకత్తా హైకోర్టు నియమించిన సహాయకుడు ( అమికస్ క్యూరీ ) సమాచారం అందించారు. మహిళా ఖైదీల ఎన్‌క్లోజర్లలోకి మగ ఉద్యోగుల ప్రవేశాన్ని వెంటనే నిషేధించాలని కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ శివజ్ఞానం, జస్టిస్‌ సుప్రతిమ్‌ భట్టాచార్యలతో కూడిన డివిజన్‌ ను ఆయన కోరారు. ఈ అంశంపై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.

జైళ్లలో మహిళా ఖైదీలు గర్భం దాల్చిన ఘటనలతో జైళ్లలో పరిస్థితులను చక్కదిద్దేందుకు అధికారులు నిర్ణయించారు. జైళ్లల్లో ఎంత మంది మహిళా ఖైదీలు గర్భవతులయ్యారో తెలుసుకుని, ఆయా జైళ్లల్లో సంస్కరణలు చేపట్టాలని కోరారు. మహిళా ఖైదీలను జైలుకు పంపించే ముందు వారికి గర్భనిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని అన్ని జిల్లాల చీఫ్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్లకు ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 09 , 2024 | 11:42 AM