Share News

IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్.. తక్కువ ఖర్చుతోనే విదేశీ టూర్..!

ABN , Publish Date - Jan 24 , 2024 | 08:27 PM

IRCTC Bumper Offer: భారత పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. దేశంలో, విదేశాల్లో పర్యటించాలనుకునే పర్యాటకుల కోసం అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీల ద్వారా పర్యాటకులు చౌకగా, కంఫర్టబుల్‌గా ప్రయాణించేందుకు వెసులుబాటు ఉంటుంది. ఐఆర్‌సీటీసీ ఆధ్యాత్మిక పర్యటనలతో పాటు.. ఎంటర్టైన్మెంట్ టూర్స్‌ ప్యాకేజీలను కూడా ప్రకటిస్తుంటుంది.

IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్.. తక్కువ ఖర్చుతోనే విదేశీ టూర్..!
IRCTC Tour Package

IRCTC Bumper Offer: భారత పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. దేశంలో, విదేశాల్లో పర్యటించాలనుకునే పర్యాటకుల కోసం అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీల ద్వారా పర్యాటకులు చౌకగా, కంఫర్టబుల్‌గా ప్రయాణించేందుకు వెసులుబాటు ఉంటుంది. ఐఆర్‌సీటీసీ ఆధ్యాత్మిక పర్యటనలతో పాటు.. ఎంటర్టైన్మెంట్ టూర్స్‌ ప్యాకేజీలను కూడా ప్రకటిస్తుంటుంది. ఈ ప్యాకేజీల్లో భాగంగా వసతి, ఆహారం ఉచితంగా అందజేస్తుంది. టూర్ గైడ్, ప్రయాణ బీమా సౌకర్యం కూడా ఉంటుంది. తాజాగా ఐఆర్‌సీటీసీ ఫిబ్రవరి నెలకు సంబంధించి టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. ఆ ప్యాకేజీలేంటో ఓసారి చూద్దాం..

IRCTC మధ్యప్రదేశ్ టూర్..

IRCTC పర్యాటకుల కోసం మధ్యప్రదేశ్ టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. 5 రాత్రులు, 6 రోజులు ట్రిప్ ఉన్న ఈ టూర్ ప్యాకేజీలో పర్యాటకులు గ్వాలియర్, జబల్‌పుర్, ఖజురహో, ఓర్చాలను సందర్శిస్తారు. ఫిబ్రవరి 21న హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఈ టూర్ ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు పర్యాటకులను తీసుకెళ్లనున్నారు. టూర్ ప్యాకేజీలో పర్యాటకులకు వసతి, ఆహారం కోసం రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. దీనితో పాటు గైడ్ సౌకర్యం కూడా ఉంటుంది. కాగా, ఈ టూర్ ప్యాకేజీలో, పర్యాటకులు విమానంలో ప్రయాణిస్తారు. ఒక్కో వ్యక్తికి రూ.42,250 చెల్లించాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో ఇద్దరు వ్యక్తులతో ప్రయాణిస్తే.. ఒక్కొక్కరికి రూ. 35,650 చెల్లించాల్సి ఉంటుంది. ముగ్గురు ప్రయాణిస్తే.. ఒక్కొక్కరికి రూ. 34,250 చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు బెడ్‌తో కూడిన ఛార్జీ రూ.31,400గా నిర్ణయించారు.

IRCTC అండమాన్ టూర్ ప్యాకేజీ..

IRCTC పర్యాటకుల కోసం అండమాన్ టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఈ టూర్ ప్యాకేజీ కొచ్చి నుంచి ప్రారంభమవుతుంది. ఈ టూర్ ప్యాకేజీ 5 రాత్రులు మరియు 6 పగళ్లు. IRCTC దేఖో అప్నా దేశ్ కింద ఈ టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఈ ప్యాకేజీలో.. పర్యాటకులు పోర్ట్ బ్లెయిర్, హేవ్‌లాక్ ద్వీపం, నీల్ ఐలాండ్‌లను సందర్శిస్తారు. ఈ టూర్ ప్యాకేజీ పేరు అల్రింగ్ అండమాన్. ఫిబ్రవరి 25 నుండి ప్రారంభమై మార్చి 1న ముగుస్తుంది.

అయితే, ఈ టూర్ ప్యాకేజీ ఛార్జీలు మారుతూ ఉంటాయి. ఒంటరిగా ప్రయాణిస్తే ఒక్కో వ్యక్తికి రూ.69,250 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులైతే ప్రయాణిస్తే ఒక్కో వ్యక్తికి రూ.52,660 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తే ఒక్కొక్కరికి రూ. 51,080 చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు బెడ్‌తో పాటు రూ.44,180 చెల్లించాలి. బెడ్ సౌకర్యం లేకుండా 5 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలకు రూ. 40,750 చెల్లించాలి. 2 నుంచి 4 ఏళ్లలోపు పిల్లలకు రూ. 36,070 ఉంటుంది.

IRCTC నేపాల్ టూర్ ప్యాకేజీ..

IRCTC పర్యాటకుల కోసం నేపాల్ టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఈ టూర్ ప్యాకేజీ ఢిల్లీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా పర్యాటకులు నేపాల్‌ను అతి తక్కువ కాస్ట్‌లో చుట్టేసి రావొచ్చు. ఈ టూర్ ప్యాకేజీ పేరు బెస్ట్ ఆఫ్ నేపాల్ X ఢిల్లీ (ND004). ఈ ప్యాకేజీలో భాగంగా పర్యాటకులు ఖాట్మండు, పోఖారాలను సందర్శించే ఛాన్స్ ఉంది. ఈ టూర్ 5 రాత్రులు మరియు 6 పగళ్లు సాగనుంది. విమానంలో తీసుకెళ్తారు. పోఖారాలో 2 రోజులు, ఖాట్మండులో 3 రోజులు ఉంటారు. ఈ టూర్ ఫిబ్రవరి 16న ప్రారంభమవుతుంది. మళ్లీ మార్చి 28న ప్రారంభమవుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో, ఫిబ్రవరి 16న ప్రయాణానికి మొత్తం సీట్లు 36, మార్చి 28న జరిగే ప్రయాణానికి మొత్తం సీట్లు 40 అందుబాటులో ఉన్నాయి.

ఇక ఈ టూర్‌కె వెళ్లాలనుకునే వారు ఒంటరిగా ప్రయాణించినట్లయితే.. ఒక్కొక్కరికి రూ. 45,700 చెల్లించాలి. ఇద్దరు ప్రయాణిస్తే.. ఒక్కొక్కరికి రూ.37,000 చెల్లించాలి. అలాగే ముగ్గురు ప్రయాణిస్తే.. ఒక్కొక్కరికి రూ. 36,500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

Updated Date - Jan 24 , 2024 | 08:27 PM