Share News

Parliament Election 2024: ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ విడుదల

ABN , Publish Date - Feb 27 , 2024 | 08:18 PM

ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 సీట్లు ఉండగా అందులో 78 స్థానాలను బీజేపీ గెలుచుకోనుందని అంచనా వేసింది. ఇక కాంగ్రెస్, సమాజ్‌వాదీ ప్రధాన పార్టీలుగా ఉన్న ఇండియా కూటమికి కేవలం 2 సీట్లకే పరిమితం కానుందని ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ పేర్కొంది. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా చూస్తే పూర్వాంచల్‌లో 29 సీట్లు ఉండగా బీజేపీ 28, ఎస్పీ-1 సీటు గెలుస్తుందని పేర్కొంది.

Parliament Election 2024: ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ విడుదల

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే, కాంగ్రెస్ ప్రధాన పార్టీగా ఉన్న ఇండియా కూటమి, ఇతర పార్టీలు తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాయి. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై పార్టీలు దృష్టిసారించాయి. ముఖ్యంగా దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌పై అన్ని పార్టీలు శ్రద్ధ పెట్టాయి. ఈ నేపథ్యంలో ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ (India TV CNX Opinion Poll) వెలువడింది. ఉత్తరప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ఏయే పార్టీ ఎన్ని సీట్లు గెలవనుందనే అంచనాలను వెలువరించింది. యూపీ వ్యాప్తంగా కేంద్రంలోని అధికార బీజేపీ అఖండ విజయాన్ని సాధిస్తుందని, అనూహ్య స్థాయిలో పెద్ద సంఖ్యలో సీట్లను గెలుచుకోనుందని లెక్కగట్టింది.

ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 సీట్లు ఉండగా అందులో 78 స్థానాలను బీజేపీ గెలుచుకోనుందని అంచనా వేసింది. ఇక కాంగ్రెస్, సమాజ్‌వాదీ ప్రధాన పార్టీలుగా ఉన్న ఇండియా కూటమికి కేవలం 2 సీట్లకే పరిమితం కానుందని ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ పేర్కొంది. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా చూస్తే పూర్వాంచల్‌లో 29 సీట్లు ఉండగా బీజేపీ 28, ఎస్పీ-1 సీటు గెలుస్తుందని పేర్కొంది. అవధ్ ప్రాంతంలో 14 సీట్లు ఉండగా బీజేపీ 13 సీట్లు, ఎస్పీ-1 స్థానం గెలుచుకోనున్నాయని తెలిపింది. బుందేల్‌ఖండ్‌లో 4 సీట్లనూ బీజేపీ గెలుచుకోనుందని అంచనా వేసింది. ఇక రోహిల్‌ఖండ్‌లో 11కు 11 సీట్లు బీజేపీ ఖాతాలోనే పడనున్నాయని, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో 8 సీట్లు ఉండగా వాటిని క్లీన్ స్వీప్ చేయనుందని లెక్కగట్టింది. మధ్య ఉత్తరప్రదేశ్‌లో 14 సీట్లు ఉండగా 13 బీజేపీ, 1 ఎస్పీ గెలుచుకునే ఛాన్స్ ఉందని పేర్కొంది.

Updated Date - Feb 27 , 2024 | 08:46 PM