Share News

Delhi: అక్కడ సిట్టింగ్ ఎంపీలను మార్చుతున్న బీజేపీ.. ఎందుకంటే

ABN , Publish Date - Jan 12 , 2024 | 04:40 PM

లోక్ సభ ఎన్నికల(Loksabha Elections 2024) సన్నద్ధతలో భాగంగా కేంద్ర బీజేపీ(BJP) కర్ణాటక(Karnataka)పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో పలువురు సిట్టింగ్ ఎంపీలు పోటీకి ససేమిరా అంటుడటంతో తాజాగా వారి స్థానంలో కొత్తవారిని నిలబెట్టే పనిలో ఉంది ఆ పార్టీ. బీజేపీ గెలుపొందిన 25 లోక్ సభ స్థానాల్లో 11 మంది అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Delhi: అక్కడ సిట్టింగ్ ఎంపీలను మార్చుతున్న బీజేపీ.. ఎందుకంటే

బెంగళూరు: లోక్ సభ ఎన్నికల(Loksabha Elections 2024) సన్నద్ధతలో భాగంగా కేంద్ర బీజేపీ(BJP) కర్ణాటక(Karnataka)పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో పలువురు సిట్టింగ్ ఎంపీలు పోటీకి ససేమిరా అంటుడటంతో తాజాగా వారి స్థానంలో కొత్తవారిని నిలబెట్టే పనిలో ఉంది ఆ పార్టీ. బీజేపీ గెలుపొందిన 25 లోక్ సభ స్థానాల్లో 11 మంది అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయబోమని పలువురు సిట్టింగ్ ఎంపీలు అధిష్టానాన్ని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

అయితే సిట్టింగ్లను మార్చడం ద్వారా వారిపై ఉన్న వ్యతిరేకత ఎన్నికల్లో దూరం అవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. 28 లోక్ సభ సీట్లు ఉన్న కర్ణాటకలో 2014లో బీజేపీ 17 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ 9 సీట్లు సాధించింది. 2019లో మరో 8 సీట్లు అదనంగా గెలుచుకుని బీజేపీ 25 స్థానాలు సాధించింది. కాంగ్రెస్ కేవలం 3 స్థానాలకే పరిమితమైంది. అయితే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి కర్ణాటకపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మాజీ సీఎం సదానంద గౌడ తాను 2024 ఎన్నికల్లో పోటీ చేయబోనని ఇదివరకే చెప్పారు.


నవంబర్ లో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు మరో 10 మంది పోటీకి ససేమిరా అంటున్నారు. వీరిలో కొందరికి ఆరోగ్యం సహకరించట్లేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సిట్టింగ్ లను మార్చడంతో కొత్తవారికి పార్టీలో అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహకర్తగా పని చేసిన సునీల్ కనుగోలు లోక్ సభ ఎన్నికలకు ఆ పార్టీకి సపోర్ట్ చేయకపోవచ్చు.

ఎలాగైనా గెలవాలని పట్టుతో ఉన్న బీజేపీ రెండోసారి ఓడిపోకుండా జాగ్రత్తపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రధాన పార్టీ జనతాదళ్ (సెక్యులర్)తో పొత్తును ప్రకటించింది. పొత్తులో భాగంగా ఆ పార్టీకి 4 ఎంపీ సీట్లు ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. అయితే సీట్ల పంపాకాల్లో ఇరుపార్టీలకు సయోధ్య కుదరట్లేదు. మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని పట్టుదలతో పని చేస్తున్న బీజేపీ ఈ సారి దేశ వ్యాప్తంగా ఏకంగా 400 లోక్ సభ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Jan 12 , 2024 | 04:41 PM