Share News

PM Modi: అయోధ్య ప్రారంభోత్సవ వేళ మోదీ ఆడియో సందేశం.. అందులో ఏముందంటే?

ABN , Publish Date - Jan 12 , 2024 | 03:06 PM

అయోధ్య రామమందిర(Ayodya Ram Mandir) ప్రారంభోత్సవ వేళ ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) శుక్రవారం కీలక ఆడియో సందేశం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను తన యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేశారు.

PM Modi: అయోధ్య ప్రారంభోత్సవ వేళ మోదీ ఆడియో సందేశం.. అందులో ఏముందంటే?

ఢిల్లీ: అయోధ్య రామమందిర(Ayodya Ram Mandir) ప్రారంభోత్సవ వేళ ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) శుక్రవారం కీలక ఆడియో సందేశం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను తన యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం నుంచి 11 రోజులపాటు "అనుస్థాన్"(ప్రత్యేక జపం) పాటించనున్నట్లు తెలిపారు. "అయోధ్య బాలరాముడి ప్రారంభోత్సవం శుభపరిణామం. ఆరోజు చారిత్రక ఘట్టం ఆవిష్కృతమవబోతోంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నా సమక్షంలో జరగడం.. కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చడానికి భగవంతుడు నన్ను పుట్టించినట్లుగా భావిస్తున్నాను. అందుకే శుక్రవారం నుంచి 11 రోజులపాటు అనుస్థాన్ చేయడానికి నిర్ణయించుకున్నాను. ఈ ఘట్టం నన్ను ఎంతో భావోద్వేగానికి గురి చేస్తోంది. నా జీవితంలో తొలిసారి ఇలాంటి అనుభూతిపొందుతున్నాను. అయోధ్య ప్రారంభోత్సవం ప్రపంచమంతటికీ పవిత్రమైన సందర్భం. రాముడిపై అన్ని ప్రాంతాల్లో భక్తిభావం పొంగి పొర్లుతుంది" అని ఆడియోలో చెప్పారు. జనవరి 22న అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు దేశ నలుమూలల నుంచి ప్రముఖులు, భక్తులు తరలిరానున్నారు. కార్యక్రమానికి కార్మికుల కుటుంబాలకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. ఆహ్వానాలు వెళ్లిన వారిలో 7 వేలకు పైగా ప్రముఖులు ఉన్నారు.


స్వచ్ఛత అభియాన్‌లో మోదీ..

స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర నాసిక్ లోని కాలరామ్ ఆలయ పరిసరాలను తుడుపుకర్రతో శుభ్రం చేశారు.

అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా రానున్న 10 రోజులపాటు దేశంలోని అన్ని ఆలయాలను శుభ్రం చేయాలని పిలుపునిచ్చారు. మోదీ ఆలయ పరిసరాలు శుభ్రం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Updated Date - Jan 12 , 2024 | 03:07 PM