Share News

Lok Sabha Elections: అడ్డం తిరిగిన మమతా బెనర్జీ తమ్ముడు... అవసరమైతే..!

ABN , Publish Date - Mar 13 , 2024 | 02:18 PM

లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడించిన మమతా బెనర్జీకి చిక్కులు తప్పేట్టు లేవు. హౌరా లోక్‌సభ నియోజకవర్గానికి ప్రసూన్ బెనర్జీని తిరిగి నామినేట్ చేయడంపై మమతా బెనర్జీ చిన్న తమ్ముడు బాబున్ బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే హౌరా సీటు నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని చెప్పారు.

Lok Sabha Elections: అడ్డం తిరిగిన మమతా బెనర్జీ తమ్ముడు... అవసరమైతే..!

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha elections) పశ్చిమబెంగాల్ (West Bengal) నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడించిన మమతా బెనర్జీ (Mamata Banerjee)కి చిక్కులు తప్పేట్టు లేవు. హౌరా లోక్‌సభ నియోజకవర్గానికి ప్రసూన్ బెనర్జీని తిరిగి నామినేట్ చేయడంపై మమతా బెనర్జీ చిన్న తమ్ముడు బాబున్ బెనర్జీ (Babun Banerjee) అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే హౌరా సీటు నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని చెప్పారు. ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉన్న ఆయన బీజేపీలో చేరుతారనే ఊహాగానాలను మాత్రం కొట్టివేశారు.


''హౌరా లోక్‌సభ సీటుకు అభ్యర్థి ఎంపిక విషయంలో నేను సంతృప్తిగా లేను. ప్రసూన్ బెనర్జీ సరైన ఎంపిక కాదు. ఎంతో మంది సమర్ధులైన అభ్యర్థులను పక్కనపెట్టి ఆయన ఎంపిక జరిగింది. నన్ను అవమాన పరచేలా ప్రసూన్ మాట్లాడటం ఎప్పటికీ మరిచిపోలేను. మమతా బెనర్జీ నా వాదనతో ఏకీభవించరని తెలుసు. అవసరమైతే హౌరా లోక్‌సభ సీటుకు స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను'' అని బాబున్ బెనర్జీ బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.


అలా చేయను...దీదీతోనే..

బీజేపీలో చేరవచ్చంటూ వస్తున్న ఊహాగానాలను బాబున్ బెనర్జీ తోసిపుచ్చారు. అలాంటి ఉద్దేశాలేవీ లేవని చెప్పారు. ''నేను దీదీతోనే ఉన్నాను. దీదీతోనే ఉంటాను. మమతా బెనర్జీ ఉన్నంత వరకూ పార్టీని ఎన్నటికీ విడిచిపెట్టను, ఏ పార్టీలోనూ చేరను'' అని చెప్పారు. అయితే తనకు క్రీడలతో సంబంధం ఉన్నందున పలువురు బీజేపీ నేతలు తెసుసునని, వారితో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు.

Updated Date - Mar 13 , 2024 | 02:30 PM