Share News

Lok Sabha Elections: కప్పులు కడిగి టీలు అందిస్తూ పెరిగా...

ABN , Publish Date - May 26 , 2024 | 02:52 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి తన బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు. చిన్నతనంలో తాను కప్ ప్లేట్లు కడుగుతూ, టీలు అందిస్తూ పెరిగానని చెప్పారు. మోదీకీ, టీకి మధ్య చాలా లోతైన సంబంధం ఉందన్నారు.

Lok Sabha Elections: కప్పులు కడిగి టీలు అందిస్తూ పెరిగా...

మీర్జాపూర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి తన బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు. చిన్నతనంలో తాను కప్ ప్లేట్లు కడుగుతూ, టీలు అందిస్తూ పెరిగానని చెప్పారు. మోదీకీ, టీకి మధ్య చాలా లోతైన సంబంధం ఉందన్నారు. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని మీర్జాపూర్‌లో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ, సమాజ్‌వాదీ పార్టీకి ఓటు వేసి దానిని వృథా చేసుకోవద్దన్నారు. సుస్థిరమైన ప్రభుత్వానికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

EC : 5 దశల్లో.. 50.72 కోట్ల మంది


'ఇండియా' కూటమి నేతల గురించి అందరికీ తెలుసునని, వారు మతతత్వ, కులతత్వవాదులని ప్రధాని విమర్శలు గుప్పించారు. ఎప్పుడు వాళ్ల ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కులం ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. యాదవకులంలో ఎందరో పేరున్న వ్యక్తులున్నప్పటికీ తమ కుటుంబ సభ్యులకే అఖిలేష్ టిక్కెట్లు ఇస్తుంటారని ఎద్దేవా చేశారు. ''సమాజ్‌వాదీ నేతలు పట్టుబడిన టెర్రరిస్టులను కూడా విడిచిపెట్టేస్తారు. విభేదించిన పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తుంటారు. ఉత్తరప్రదేశ్, పూర్వాంచల్‌ను మాఫియాకు స్వర్గధామం చేస్తుంటారు. సమాజ్‌వాదీ ప్రభుత్వంలో లైఫ్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు.. ఎప్పుడు లాగేసుకుంటారో ఎవరికీ తెలియదు. మాఫియాను ఓటు బ్యాంకుగా వారు చూస్తుంటారు'' అని మోదీ విమర్శలు గుప్పించారు. పవిత్రమైన రాజ్యాంగాన్ని కూడా 'ఇండి' కూటమి ఇప్పుడు తమ లక్ష్యంగా చేసుకుందని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నుంచి రిజర్వేషన్లను ఊడలాక్కోవాలనుకుంటోందని అన్నారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఉండరాదని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోందన్నారు. పోలీస్, పీఏసీలో కూడా ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్ ఇస్తామని సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించిందని, వారి ఓటు బ్యాంకు కోసమే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను ఊడలాక్కోవాలని అనుకుంటోందని చెప్పారు. పేదలు, దళితులు, వెనుకబడిన తరగతుల వారి కోసం తాము అంకితభావంతో పనిచేస్తామని మోదీ భరోసా ఇచ్చారు.

Read National News and Latest News here

Updated Date - May 26 , 2024 | 02:52 PM