Share News

Kangana Ranaut: స్టార్‌ను కాదు, మీ అడబిడ్డను: కంగనా రనౌత్

ABN , Publish Date - Mar 29 , 2024 | 05:43 PM

'క్వీన్' చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకుల విశేషాదారణ చూరగొన్న నటి కంగనా రనౌత్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో శుక్రవారంనాడు రోడ్‌షో నిర్వహించారు. ఆమెకు ప్రజల నుంచి సాదర స్వాగతం లభించింది. తనను ఒక హీరోయిన్‌గానో, స్టార్‌గానో చూడవద్దని, ఒక కుమార్తెగా, సోదరిగా చూడమని ఆమె ఈ సందర్భంగా అందరినీ కోరారు.

Kangana Ranaut: స్టార్‌ను కాదు, మీ అడబిడ్డను: కంగనా రనౌత్

మండి: 'క్వీన్' చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకుల విశేషాదారణ చూరగొన్న నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని మండి (Mandi)లో శుక్రవారంనాడు రోడ్‌షో నిర్వహించారు. ఆమెకు ప్రజల నుంచి సాదర స్వాగతం లభించింది. తనను ఒక హీరోయిన్‌గానో, స్టార్‌గానో చూడవద్దని, ఒక కుమార్తెగా, సోదరిగా చూడమని ఆమె ఈ సందర్భంగా అందరినీ కోరారు. మండి లోక్‌‍సభ నియోజకవర్గం నుంచి బీజేపీ (BJP) అభ్యర్థిగా కంగన పోటీ చేస్తున్నారు.


లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేస్తు్న్న కంగన రనౌత్.. ఇదే మండి జిల్లాలోని భాంబ్లా అనే ఒక చిన్న పట్టణంలో రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించారు. ఇప్పటికే బాలీవుడ్ నటిగా నిర్మాతగా సత్తా చాటుకుని నాలుగు సార్లు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. మండిలో రోడ్‌షాకు మందు మీడియాతో కంగనా రనౌత్ మాట్లాడుతూ..''చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకావడాన్ని మీరు చూస్తున్నారు. ఈ గడ్డలో (మండి) పుట్టిన తమ కుమార్తె, మండికి చెందిన జాతీయవాణి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేందుకు వచ్చినందుకు గర్వంగా ఉందని వారంతా చెబుతున్నారు'' అని అన్నారు. అభివృద్ధే బీజేపీ ప్రధాన ఎజెండా అని చెప్పారు. కంగనా ప్రచారానికి సందర్భంగా మండివాసులు 'జై రామ్' నినాదాలు హోరెత్తించారు.


హిమాచల్ ప్రదేశ్‌లో హమీర్‌పూర్, మండి, సిమ్లా, కాంగ్రా లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. 2019 ఎన్నికల్లో ఈ నాలుగు సీట్లను బీజేపీ గెలుచుకుంది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈ నాలుగు నియోజకవర్గాలతో పాటు, ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూన్ 1న పోలింగ్ జరుగనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 29 , 2024 | 05:44 PM