Share News

High Court: భర్తకు రూ.10 వేలు ఇవ్వాల్సిందే.. భార్యను ఆదేశించిన హైకోర్టు

ABN , Publish Date - Apr 11 , 2024 | 05:44 PM

అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమైన మాజీ భర్తకు నెలవారీ భరణం కింద రూ.10వేలు చెల్లించాల్సిందేనని ఓ మహిళను బాంబే హైకోర్టు(Bombay High Court) ఆదేశించింది. గురువారం ఇందుకు సంబంధించి కీలక తీర్పు వెలువరించింది. హిందూ వివాహ చట్టంలోని నిబంధనల్లో భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైందని చెబుతారని జస్టిస్ షర్మిలా దేశ్‌ముఖ్‌తో కూడిన సింగిల్ బెంచ్ పేర్కొంది.

High Court: భర్తకు రూ.10 వేలు ఇవ్వాల్సిందే.. భార్యను ఆదేశించిన హైకోర్టు

ముంబయి: అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమైన మాజీ భర్తకు నెలవారీ భరణం కింద రూ.10వేలు చెల్లించాల్సిందేనని ఓ మహిళను బాంబే హైకోర్టు(Bombay High Court) ఆదేశించింది. గురువారం ఇందుకు సంబంధించి కీలక తీర్పు వెలువరించింది. హిందూ వివాహ చట్టంలోని నిబంధనల్లో భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైందని చెబుతారని జస్టిస్ షర్మిలా దేశ్‌ముఖ్‌తో కూడిన సింగిల్ బెంచ్ పేర్కొంది. అంటే కష్ట సుఖాల్లో భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉండాలని అర్థమని వివరించింది. అసలేమైందంటే.. మహారాష్ట్రకి చెందిన ఇద్దరు దంపతులు విడిపోయారు.

భర్త అనారోగ్యం కారణంగా బతకడమే కష్టంగా మారింది. తనకు భార్య భరణం చెల్లించాలని కోరుతూ భర్త బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. మహిళ తన మాజీ భర్త అనారోగ్యం కారణంగా జీవనోపాధి పొందే స్థితిలో లేడనే విషయాన్ని మహిళ గుర్తించడం లేదని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. భర్త తనను తాను పోషించుకోలేక పోతున్నందునా ఉద్యోగం చేస్తున్న భార్య భరణం చెల్లించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.

తన మాజీ భర్తకు నెలవారీ భరణం కింద రూ.10 వేలు చెల్లించాలని సివిల్ కోర్టు 2020 మార్చిలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సదరు మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. కుటుంబ న్యాయస్థానం దంపతులకు విడాకులు మంజూరు చేయడంతోపాటు తన మాజీ భార్య నుంచి నెలవారీ భరణం కోరుతూ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ని స్వీకరించింది.


అనారోగ్యం కారణంగా తాను పని చేయలేకపోతున్నానని, అందువల్ల బ్యాంక్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న తన మాజీ భార్య నుంచి భరణం పొందడానికి అర్హుడని బాధితుడు పేర్కొన్నారు. ఇప్పటికే గృహ రుణం చెల్లించడంతోపాటు ఇద్దరు పిల్లల పెంపకం తదితర బాధ్యతలు ఉన్నందున మాజీ భర్తకు భరణం చెల్లించే స్థితిలో లేనని ఆమె కోర్టులో వాదించింది.

Haryana: స్కూల్ బస్ బోల్తా.. ఏడుగురు చిన్నారులు మృతి..

2019లో ఉద్యోగానికి రాజీనామా చేశానని, ఆ సమయంలో ఎలాంటి ఆదాయ వనరులు లేవని ఆ మహిళ పేర్కొంది. అయితే ఉద్యోగం లేకుండా తాను, పిల్లలను ఎలా చూసుకుంటుందో మహిళ వెల్లడించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం మహిళ తాను సంపాదిస్తున్న విషయాన్ని వివాదం చేయడం తగదని.. మహిళ తనకు ఉద్యోగం లేదని చూపించడానికి ఎలాంటి సాక్ష్యాలను సమర్పించలేదని జస్టిస్ దేశ్‌ముఖ్ చెప్పారు.

అలాంటప్పుడు భర్తకు భరణం సమర్పించడంలో ఉన్న అభ్యంతరం ఏంటో మాజీ భార్య చెప్పాలని సూచించారు. అనారోగ్యంతో ఉన్న మాజీ భర్తకు ప్రతి నెల రూ.10 వేలు ఇవ్వాల్సిన బాధ్యత భార్యపై ఉందని చెబుతూ కోర్టు తీర్పు వెలువరించింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 11 , 2024 | 05:45 PM