Share News

Have More children: ఎక్కువ మంది పిల్లల్ని కనండి, అందరికీ మోదీ ఇళ్లు కట్టిస్తారు..

ABN , Publish Date - Jan 10 , 2024 | 03:13 PM

ఎక్కువ మంది పిల్లల్ని కనాలని రాజస్థాన్ మంత్రి బాబులాల్ ఖరాడీ అన్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారందరికీ ఇళ్లు నిర్మి్స్తారని భరోసా ఇచ్చారు. రాజస్థాన్ గిరిజనాభివృద్ధి మంత్రిగా ఉన్న బాబులాల్ ఉదయ్‌పూర్‌లోని నాయి గ్రామంలో బీజేపీ నిర్వహించిన 'వికసిత్ భారత్ సంకల్ప యాత్ర' కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Have More children: ఎక్కువ మంది పిల్లల్ని కనండి, అందరికీ మోదీ ఇళ్లు కట్టిస్తారు..

జైపూర్: ఎక్కువ మంది పిల్లల్ని కనాలని రాజస్థాన్ (Rajasthan) మంత్రి బాబులాల్ ఖరాడీ (Babulal Kharadi) అన్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారందరికీ ఇళ్లు నిర్మి్స్తారని భరోసా ఇచ్చారు. రాజస్థాన్ గిరిజనాభివృద్ధి మంత్రిగా ఉన్న బాబులాల్ ఉదయ్‌పూర్‌లోని నాయి గ్రామంలో బీజేపీ నిర్వహించిన 'వికసిత్ భారత్ సంకల్ప యాత్ర' కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


ఎవరూ ఆకలితో, తలపై కప్పు (నివాసం) లేకుండా నిద్రపోకూడదనేది మోదీ కల అని మంత్రి చెప్పారు. ఎక్కువ మంది పిల్లల్ని కనాలని, ప్రధాని వారికి ఇళ్లు కట్టిస్తారని, ఇందులో సమస్య ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. ఖరాడీకి ఇద్దరు భార్యలు, ఎనిమిది మంది సంతానం ఉండగా, వారిలో నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరంతా ఉదయ్‌పూర్ జిల్లా నీచ్లా తాలా గ్రామంలో నివసిస్తుంటారు.

Updated Date - Jan 10 , 2024 | 03:13 PM