Share News

Union Budget 2024: బీజేపీ గారడీలు ప్రదర్శించింది.. బడ్జెట్‌పై శశి థరూర్ విమర్శలు

ABN , Publish Date - Feb 01 , 2024 | 09:18 PM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై(Union Budget 2024) కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్(Shashi Tharoor) విమర్శలు సంధించారు. బీజేపీ(BJP) ప్రభుత్వం లెక్కల పేరుతో గారడీలు ప్రదర్శించిందని విమర్శించారు.

Union Budget 2024: బీజేపీ గారడీలు ప్రదర్శించింది.. బడ్జెట్‌పై శశి థరూర్ విమర్శలు

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై(Union Budget 2024) కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్(Shashi Tharoor) విమర్శలు సంధించారు. బీజేపీ(BJP) ప్రభుత్వం లెక్కల పేరుతో గారడీలు ప్రదర్శించిందని విమర్శించారు. అప్పులు చేస్తూ, యువతకు ఉపాధి కల్పించడంలో విఫలమవుతూ, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయకుండా బడ్జెట్‌లో గారడీలు చూపించారని ఎద్దేవా చేశారు.

"2015 నుంచి ప్రజల ఆదాయాలు 50 శాతానికిపైగా తగ్గాయి. ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. బడ్జెట్‌లో వారికి ఊరటనిచ్చే అంశం ఒక్కటీ లేదు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను బడ్జెట్ పూర్తిగా విస్మరించింది. దేశ వ్యాప్తంగా గడిచిన 10 ఏళ్లలో నిరుద్యోగం 45 సంవత్సరాల గరిష్ఠానికి చేరింది" అని థరూర్ పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2047నాటికి భారత్‌ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని తన ప్రసంగంలో తెలిపారు.

Updated Date - Feb 01 , 2024 | 09:18 PM