Share News

Delhi: వంటపాత్రలపై ఇకపై ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం

ABN , Publish Date - Jul 05 , 2024 | 07:46 PM

స్టెయిన్‌లెస్ స్టీల్, అల్యూమినియం వంట పాత్రలకు భారతీయ ప్రమాణాల సంస్థ (ISI) గుర్తు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాత్రలు ఇకపై జాతీయ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది.

Delhi: వంటపాత్రలపై ఇకపై ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం

ఢిల్లీ: స్టెయిన్‌లెస్ స్టీల్, అల్యూమినియం వంట పాత్రలకు భారతీయ ప్రమాణాల సంస్థ (ISI) గుర్తు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాత్రలు ఇకపై జాతీయ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది.

వినియోగదారుల భద్రత, ఉత్పత్తి నాణ్యతను పెంచే లక్ష్యంతో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రమోషన్ విభాగం (DPIIT) మార్చి 14న వంటగది పాత్రలకు ISI గుర్తును తప్పనిసరి చేస్తూ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్‌ను జారీ చేసింది.


ISI గుర్తును BIS అభివృద్ధి చేసింది. BIS ప్రకారం.. బీఐఎస్ స్టాండర్డ్ మార్క్‌ లేని ఏదైనా స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా అల్యూమినియం పాత్రల తయారీ, దిగుమతి, అమ్మకం, పంపిణీ, నిల్వ లేదా విక్రయం నిషేధం. కంపెనీలు ప్రభుత్వ ఆదేశాలు పాటించకుంటే జరిమానాలు విధిస్తామని అధికారులు చెబుతున్నారు.

For Latest News and National News click here

Updated Date - Jul 05 , 2024 | 07:51 PM