Share News

Ayodhya Ram Temple: 32 ఏళ్ల కల నెరవేరింది... ముస్లిం కరసేవకుని భావోద్వేగం

ABN , Publish Date - Jan 07 , 2024 | 04:57 PM

అయోధ్య నుంచి ఎక్కడో మారుమూలన ఉన్న తనకు అక్షింతలు, ఒక లేఖ, దివ్య రామాలయం ఫోటో రావడంతో 70 ఏళ్ల ముస్లిం కరసేవకుడు మొహమ్మద్ హబీబ్ భావోద్వేగానికి గురయ్యాడు. మీర్జాపూర్‌కు చెందిన హబీబ్ బీజేపీ జిల్లా విభాగంలో పలు పదవులు నిర్వహించాడు.

Ayodhya Ram Temple: 32 ఏళ్ల కల నెరవేరింది... ముస్లిం కరసేవకుని భావోద్వేగం

లక్నో: అయోధ్య నుంచి ఎక్కడో మారుమూలన ఉన్న తనకు అక్షింతలు (Akishta), ఒక లేఖ, దివ్య రామాలయం ఫోటో రావడంతో 70 ఏళ్ల ముస్లిం కరసేవకుడు మొహమ్మద్ హబీబ్ (Mohammad Habbi) భావోద్వేగానికి గురయ్యాడు. మీర్జాపూర్‌కు చెందిన హబీబ్ బీజేపీ జిల్లా విభాగంలో పలు పదవులు నిర్వహించాడు. 32 ఏళ్ల తర్వాత తన కలసాకారమైందని రామజన్మభూమి కోసం పోరాడినప్పటి గత జ్ఞాపకాలను ఆయన నెమరువేసుకున్నాడు.


బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6న కరసేవకులు కప్పకుల్చిన ఘటనను హబీబ్ గుర్తు చేసుకుంటూ...''కరసేవకుడిగా 1992 డిసెంబర్ 2 నుంచి నాలుగైదు రోజులు కొందరి వ్యక్తులతో కలిసి అయోధ్యలో ఉన్నాను. మొదట్నించీ నేను బీజేపీ వీరాభిమానిని. దాదాపు 32 ఏళ్ల తర్వాత ఇప్పటికి ఫలితం వచ్చింది. గత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. రాముడిని మా పూర్వీకుడిగానే నేను భావిస్తాను. రాముడు అయోధ్యలో జనవరి 22న కొలువుదీరడం ప్రతి ఒక్కరికీ చారిత్రక దినంగా మిగిలిపోతుంది. ఎంతో తపస్సు, ఎన్నో యుద్ధాల తర్వాత ఈరోజు (ప్రతిష్ఠాపన రోజు) వచ్చింది'' అని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించినట్టు అయోధ్యలో భవ్య రామాలయ ప్రారంభోత్సవం, రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఇంట్లోనే టీవీలో చూస్తానని, 22వ తేదీ తర్వాత అయోధ్యకు వెళ్లి శ్రీరాముని దర్శనం చేసుకుంటానని హబీబ్ చెప్పారు.

Updated Date - Jan 07 , 2024 | 04:57 PM