Share News

Former CM: పంచాయతీలను నగరాల్లో విలీనం చేయొద్దు

ABN , Publish Date - Jan 12 , 2024 | 08:57 AM

రాష్ట్రంలో పంచాయతీలను నగరాల్లో విలీనం చేసే చర్యలు చేపట్టకూడదంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) డిమాండ్‌ చేశారు.

Former CM: పంచాయతీలను నగరాల్లో విలీనం చేయొద్దు

- ఈపీఎస్‌ డిమాండ్‌

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పంచాయతీలను నగరాల్లో విలీనం చేసే చర్యలు చేపట్టకూడదంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన జారీ చేస్తూ... పంచాయతీలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధుల కాలం ఈ యేడాదితో ముగియనుడంటంతో ఆ పంచాయతీలను సమీపంలో ఉన్న నగర పంచాయతీలు, లేదా నగర మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేసే విషయంగా అధికారులు ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకర జరుపుతున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. సాధారణంగా ప్రతి పంచాయతీకి అక్కడి జనాభా ప్రాతిపదికగా కేంద్రప్రభుత్వం వివిధ పథకాల అమలుకు నిధులు కేటాయిస్తుందన్నారు.. ప్రస్తుతం కేంద్రం ఆ నిధులను బాగా తగ్గించిందన్నారు. దీంతో పంచాయతీలను నగర పంచాయతీలు, మునిసిపాలిటీలలో విలీనం చేయాలని డీఎంకే ప్రభుత్వం నిర్ణయించిందని, ఎట్టి పరిస్థితులలోనూ ఇతర స్థానిక సంస్థలతో విలీనం చేయకూడదని కోరారు. అవసరమయితే రాష్ట్ర ప్రభుత్వమే గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించి ఆదుకోవాలని ఈపీఎస్‌ విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jan 12 , 2024 | 08:57 AM