Share News

Delhi: కొనసాగుతున్న భారత్ బంద్.. ఢిల్లీలో ఆ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

ABN , Publish Date - Feb 16 , 2024 | 10:26 AM

డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ శుక్రవారం ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితుల నడుమ కొనసాగుతోంది. పంజాబ్‌లో బస్సులు బస్టాప్‌లకే పరిమితమయ్యాయి. ఢిల్లీ - నోయిడా మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల నుంచి ప్రయాణించేవారు ప్రత్యామ్నయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.

Delhi: కొనసాగుతున్న భారత్ బంద్.. ఢిల్లీలో ఆ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

ఢిల్లీ: డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ శుక్రవారం ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితుల నడుమ కొనసాగుతోంది. పంజాబ్‌లో బస్సులు బస్టాప్‌లకే పరిమితమయ్యాయి. ఢిల్లీ - నోయిడా మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల నుంచి ప్రయాణించేవారు ప్రత్యామ్నయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.

ఢిల్లీవైపు తరలివస్తున్న రైతులను నిలువరించేందుకు సరిహద్దు భద్రతా దళ అధికారులు 30 వేల టియర్ గ్యాస్ సెల్‌లను సిద్ధం చేసుకున్నారు. నిరసనలు నాలుగో రోజుకి చేరుకోవడంతో గురువారం అర్ధరాత్రి నోయిడా పోలీసులు 144 సెక్షన్ విధించారు.

ఢిల్లీ - హరియాణా సరిహద్దులోని టిక్రీ, సింగు అనే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆందోళన చేస్తున్న రైతులను నిలువరించేందుకు బాష్పవాయువును, వాటర్ క్యానన్‌లను ప్రయోగిస్తున్నారు. బారికేడ్లు, ఇనుప మేకులు, ముళ్ల తీగలతో రైతులను అడ్డగిస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు వెనక్కి తగ్గబోమని రైతులు తేల్చి చెబుతున్నారు.


పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండు చేస్తూ ఢిల్లీ శివారుల్లో ఒకవైపు అన్నదాతలు ఆందోళన కొనసాగుతుండగా చండీగఢ్‌లో గురువారం ముగ్గురు కేంద్రమంత్రులు రైతు నాయకులతో చర్చలు జరిపారు. ఆందోళన మొదలయిన తరువాత ఇవి మూడో దఫా చర్చలు కావడం విశేషం. గురువారం అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగాయి.

రైతు సంఘాలతో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్. నిన్న (గురువారం) అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. అయితే రైతుల డిమాండ్లపై స్పష్టత రాలేదు. కాగా శుక్రవారం భారత్ బంద్‌కు రైతు సంఘాలు పిలుపునివ్వడంతో బంద్ కొనసాగుతోంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 16 , 2024 | 10:32 AM