Punjab Bandh: డిసెంబర్ 30న పంజాబ్ బంద్..
ABN , Publish Date - Dec 29 , 2024 | 09:05 PM
పంజాబ్ బంద్‌కు రైతులు పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు ఈ బంద్ కొనసాగుతోందని రైతులు వెల్లడించారు.

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: దేశ రాజధాని న్యూఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనకు దిగిన రైతులు.. సోమవారం పంజాబ్‌లో బంద్‌కు పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో ఉదయం 7 .00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు బంద్‌కు సహకరించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో ప్రజలకు పాలు, కూరగాయలు తదితర నిత్యవసర వస్తువులు సరఫరా ఉండబోదన్నారు. అలాగే రహదారులపై వాహనాలు, రైళ్లను సైతం తిరగనివ్వమన్నారు. ఈ బంద్‌కు వాణిజ్య సంస్థలు సైతం మద్దతు ఇచ్చాయన్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు బంద్‌కు మద్దతుగా మూసి ఉంచాలని కోరారు. అయితే అంబులెన్స్‌లు, వివాహ వాహనాలతోపాటు అత్యవసర పరిస్థితుల్లో రాక పోకలు సాగించే వారికి మాత్రం అనుమతిస్తామని చెప్పారు. డిసెంబర్ 30వ తేదీ 'పంజాబ్ బంద్'కు పిలుపునివ్వాలని గత వారం సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్)తోపాటు కిసాన్ మజ్దూర్ మోర్చా నిర్ణయం తీసుకున్నాయి. ఈ బంద్‌కు వ్యాపారులు, ఉద్యోగ సంఘాలు, కార్మికులు, మాజీ సైనికులు, సర్పంచ్‌లతోపాటు వివిధ వర్గాల వారు మద్దతు ప్రకటించారు.
తాము పండించే పంటలకు కనీస మద్దతు ధరలు కల్పించాలంటూ.. 101 మంది రైతులు గత కొంత కాలంగా పంజాబ్, ఢిల్లీ సరిహద్దుల్లో శంభు వద్ద ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి తమ డిమాండ్లను వివరించేందుకు పలుమార్లు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని భద్రతా దళాలు అడ్డుకొన్నారు. దీంతో వచ్చే ఏడాది జనవరి 4 వ తేదీన ఖౌనౌరీ నిరసన ప్రదేశంలో కిసాన్ మహాపంచాయత్ నిర్వహించాలని ఆందోళన కారులు ప్రకటించారు.
మరోవైపు నిరవధిక నిరసన దీక్ష చేపట్టిన రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్‌ను ఆసుపత్రికి తరలించనందుకు పంజాబ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డెబ్భై ఏళ్లు పైబడిన ఆయనకు వైద్య చికిత్స అందకుండా అడ్డుపడుతున్న రైతు నేతల ఉద్దేశంపైనా సుప్రీంకోర్టు సందేహం వ్యక్తం చేసింది. నిజంగా ఆయన క్షేమాన్ని కోరుకునేవారైతే, అలా వైద్య సాయాన్ని అడ్డుకోరని స్పష్టం చేసింది. అవరసరమైతే.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జగ్జీత్ సింగ్‌ను ఆసుపత్రికి తరలించాలని.. అందుకు డిసెంబర్ 31వ తేదీ వరకు సమయం ఇస్తున్నట్లు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ సుధాంశు ధూలియాల ధర్మాసనం ప్రకటించింది.
Also Read: 2025లో ఏర్పడనున్న గ్రహణాలు..
Also Read: అల్లు అర్జున్‌కి ఓయూ జేఏసీ వార్నింగ్
Also Read: ట్రాక్టర్ నడపడానికి లైసెన్స్ అవసరమా..?
Also Read: జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 75 మంది ఉగ్రవాదులు హతం
Also Read: పోలీస్ శాఖలో మరణ మృదంగం.. ఈ ప్రభుత్వానికి పట్టదా?
Also Read: వారికి విజయవాడ నగర సీపీ వార్నింగ్
For National News And Telugu News