Share News

Eclipses In 2025: 2025లో ఏర్పడనున్న గ్రహణాలు..

ABN , Publish Date - Dec 29 , 2024 | 08:20 PM

4 Eclipses In 2025: వచ్చే ఏడాది నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. వాటిలో రెండు సూర్య గ్రహణాలు కాగా.. మరో రెండు చంద్ర గ్రహణాలు. ఈ గ్రహణాలు మార్చి.. నవంబర్ మధ్య ఏర్పడనున్నాయి.

Eclipses In 2025: 2025లో ఏర్పడనున్న గ్రహణాలు..

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరం 2025 ప్రారంభం కానుంది. ఈ కొత్త ఏడాదిలో నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. అవి రెండు సూర్య గ్రహణాలు కాగా.. మరో రెండు చంద్ర గ్రహణాలు. అయితే వీటిలో ఒకటి మాత్రమే భారత్‌లో కనిపిస్తుందని మధ్యప్రదేశ్‌ ఉజ్జయినీలోని జీవాజీ అంతరిక్ష అధ్యయన కేంద్రం సూపరింటెండెంట్ రాజేంద్ర ప్రకాష్ గుప్తా ఆదివారం వెల్లడించారు.

మార్చి 14వ తేదీన..

వచ్చే ఏడాది మార్చి 14 వ తేదీన సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవించనుందన్నారు. అయితే.. ఇది పగటిపూట ఏర్పడడం వల్ల మన దేశంలో కనిపించే అవకాశం లేదని పేర్కొన్నారు. అయితే అమెరికా, పశ్చిమ ఐరోపా, పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రాల వద్ద ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందని తెలిపారు.

మార్చి 29వ తేదీన..

ఇక మార్చి 29వ తేదీన పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడనుందని.. దీని ప్రభావం మాత్రం భారత్‌లో ఉండదని స్పష్టం చేశారు. ఉత్తర అమెరికా, గ్రీన్ ల్యాండ్, ఉత్తర అట్లాంటిక్ సముద్రం, యూరప్‌తోపాటు వాయువ్య రష్యాలో ఈ గ్రహణం కనిపిస్తుందన్నారు.


సెప్టెంబర్ 7,8 తేదీల్లో...

సెప్టెంబర్ 7, 8 తేదీల్లో చంద్రగహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం దేశవ్యాప్తంగా కనిపిస్తుందని చెప్పారు. ఈ గ్రహణాన్ని భారతీయులే కాకుండా.. ఆసియా, యూరప్, అంటార్కటికా, పశ్చిమ పసిఫిక్ సముద్రం, ఆస్ట్రేలియా, బంగాళాఖాతం ప్రాంతంలోని వారికి కనిపిస్తుందని గుప్తా వివరించారు. ఈ గ్రహణం రాత్రి 8.58 గంటలకు ఏర్పడనుందని.. ఇది ఆ మరునాడు తెల్లవారుజామున అంటే.. 2.25 గంటలకు ముగుస్తుందన్నారు.

Also Read: అల్లు అర్జున్‌కి ఓయూ జేఏసీ వార్నింగ్

Also Read: ట్రాక్టర్ నడపడానికి లైసెన్స్ అవసరమా..?


సెప్టెంబర్ 21, 22 తేదీల్లో..

అలాగే సెప్టెంబర్ 21, 22 తేదీల్లో సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఇది భారత్‌లో కనిపించదు. న్యూజిలాండ్, పశ్చిమ అంటార్కటికా తదితర ప్రాంతాల్లో కనిపిస్తుందని రాజేంద్ర ప్రకాష్ గుప్తా వివరించారు.

Also Read: జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 75 మంది ఉగ్రవాదులు హతం

Also Read: పోలీస్ శాఖలో మరణ మృదంగం.. ఈ ప్రభుత్వానికి పట్టదా?

Also Read: వారికి విజయవాడ నగర సీపీ వార్నింగ్

For National News And Telugu News

Updated Date - Dec 29 , 2024 | 08:22 PM