Share News

Express trains: 14 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రద్దు.. కారణం ఏంటంటే...

ABN , Publish Date - Jan 06 , 2024 | 09:00 AM

రాష్ట్రం నుంచి ఉత్తరాదికి వెళ్లే 14 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు చేసినట్లు సేలం రైల్వే డివిజన్‌ తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగే రైలు మార్గ మరమ్మతుల కారణంగా రైలు సర్వీసులు రద్దయ్యాయి.

Express trains: 14 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రద్దు.. కారణం ఏంటంటే...

ఐసిఎఫ్‌(చెన్నై): రాష్ట్రం నుంచి ఉత్తరాదికి వెళ్లే 14 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు చేసినట్లు సేలం రైల్వే డివిజన్‌ తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగే రైలు మార్గ మరమ్మతుల కారణంగా రైలు సర్వీసులు రద్దయ్యాయి. తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్లే కేరళ ఎక్స్‌ప్రెస్‌, తిరువనంతపురం - హజరత్‌ నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 9 నుం చి ఫిబ్రవరి 2వ తేది వరకు, ఎర్నాకుళం- హజరత్‌నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌ శనివారం నుంచి ఫిబ్రవరి 6వ తేది వరకు, కోవై- హజరత్‌ నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 21, 24, 28, 31 తేదీలు, మదురై, ఛండీఘర్‌ రైలు ఈనెల 10నుంచి ఫిబ్రవరి 5వ తేది వరకు, కన్నియాకుమారి - శ్రీమాతా వైష్ణో దేవి కట్రా వారాంతపు రైలు ఈనెల 12నుంచి ఫిబ్రవరి 5వ తేది వరకు, తిరునల్వేలి - శ్రీమాతా వైష్ణో దేవి కట్రా వారాంతపు రైలు ఈ నెల 8 నుంచి ఫిబ్రవరి 1వ తేది వరకు రెండు మార్గాల్లో రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - Jan 06 , 2024 | 09:00 AM