Share News

Excise policy scam: ఎంపీ సంజయ్ సింగ్‌కు దక్కని ఉపశమనం... బెయిలుకు హైకోర్టు 'నో'

ABN , Publish Date - Feb 07 , 2024 | 09:54 PM

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసు కింద అరెస్టయిన ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ కు మళ్లీ నిరాశ ఎదురైంది. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన చేసుకున్న విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు తోసిపుచ్చింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

Excise policy scam: ఎంపీ సంజయ్ సింగ్‌కు దక్కని ఉపశమనం... బెయిలుకు హైకోర్టు 'నో'

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం (Delhi Excise policy scam)లో మనీ లాండరింగ్ కేసు కింద అరెస్టయిన ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ (Sanjay Singh)కు మళ్లీ నిరాశ ఎదురైంది. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన చేసుకున్న విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు తోసిపుచ్చింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. సంజయ్ సింగ్ బెయిలు దరఖాస్తుపై ఢిల్లీ హైకోర్టు జనవరి 31 తీర్పును రిజర్వ్ చేసింది.


''కేసు ప్రస్తుత దశలో నిందితుడికి బెయిలు మంజూరు చేయలేం. త్వరతిగతిన విచారణ జరపాలని ట్రయిల్ కోర్టును ఆదేశిస్తున్నాం. ఇరువర్గాలు ఎలాంటి వాయిదాలు కోరవద్దు'' అని జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తన తీర్పులో పేర్కొన్నారు. కాగా, కేసులో తన ప్రమేయం లేనప్పటికీ తనను మూడు నెలలకు పైగా తనను నిర్బంధంలో ఉంచారని సంజయ్ సింగ్ బెయిలు దరఖాస్తులో కోర్టుకు విన్నవించారు. అయితే సంజయ్ సింగ్‌కు ఈ స్కామ్‌తో ప్రమేయం ఉన్నందున ఆయనకు బెయిల్ ఇవ్వరాదంటూ ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో సంజయ్ సింగ్‌కు కీలక పాత్ర ఉందనే అభియోగంపై 2023 అక్టోబర్ 4న ఈడీ ఆయనను అరెస్టు చేసింది. అక్టోబర్ 13 నుంచి ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 09:54 PM