2024 Elections: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మొత్తం ఏడు దశల్లో.. ఏయే తేదీల్లో అంటే?
ABN , Publish Date - Mar 16 , 2024 | 02:53 PM
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. కేంద్ర ఎన్నిల సంఘం (ECI) కమిషనర్లు రాజీవ్‌కుమార్, జ్ఞానేశ్‌కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధులు కలిసి ఈ ఎన్నికల షెడ్యూల్‌ని మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటించారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ (2024 Lok Sabha Election Schedule) విడుదల అయ్యింది. లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో ఉండనున్నాయని.. ఏప్రిల్ 19వ తేదీ నుంచి పోలింగ్ ప్రారంభమవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కేంద్ర ఎన్నిల సంఘం (Election Commission Of India - ECI) ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ (Rajiv Kumar) మరో ఇద్దరు కమిషనర్లు జ్ఞానేశ్‌కుమార్ (Gyanesh Kumar), సుఖ్‌బీర్ సింగ్ సంధులతో (Sukhbir Singh Sandhu) కలిసి ఈ ఎన్నికల షెడ్యూల్‌ని శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటించారు.
ఏడు దశల్లో పోలింగ్:
ఏప్రిల్ 19 - తొలిదశ ఎన్నికలు
ఏప్రిల్ 26 - రెండో దశ పోలింగ్
మే 7 - మూడో దశ పోలింగ్
మే 13 - నాలుగో దశ
మే 20 - ఐదో దశ పోలింగ్
మే 25 - ఆరో దశ పోలింగ్
జూన్ 1 - ఏడో దశ పోలింగ్
కాగా.. ప్రస్తుత 17వ లోక్‌సభ (Lok Sabha) గడవు జూన్ 16తో ముగియనుండగా.. ఆంధ్రప్రదేశ్ (జూన్ 11), ఒడిశా (జూన్ 24), అరుణాచల్ ప్రదేశ్ (జూన్ 2), సిక్కిం (జూన్ 2) అసెంబ్లీల గడువు కూడా జూన్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఈసీ (EC) వివిధ రాష్ట్రాల్లో పర్యటించి.. స్థానిక రాజకీయ పార్టీలతో పాటు అధికారులతో సమావేశాలు నిర్వహించి.. ఆ తర్వాత ఈ ఎన్నికల షెడ్యూల్‌ని (Election Schedule) తయారు చేసింది. ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో సుమారు 97 కోట్ల ఓటర్లు ఉన్నారన్నారు. వారిలో 49.7 మంది పురుషులు, 47.1 మహిళా ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. అందులో కోటి 80 లక్షల మంది కొత్త ఓటర్లు ఉండటం గర్వించదగిన విషయమని చెప్పారు. దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలున్నాయని, ఎన్నికల విధుల్లో 1.5 కోట్ల మంది ఉద్యోగులు ఉన్నారని స్పష్టం చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో మౌలిక సదుపాయాలు ఉంటాయని.. తాగునీరుతో పాటు టాయిలెట్లను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
మరిన్ని ముఖ్యాంశాలు:
* ఏప్రిల్ 1 వరకు ఓటర్ల జాబితాలో మార్పులకు అవకాశం
* హింసకు పాల్పడితే నాన్-బెయిలబుల్ వారెంట్స్
* పోలింగ్ డ్యూటీలో వలంటీర్లు, కాంట్రాక్ట్ సిబ్బంది నోఎంట్రీ
* రోండోసారి ఓటు వేయడానికి వేస్తే కేసు నమోదు
* జూన్ 16లోపు ఎన్నికల ప్రక్రియ ముగింపు
* బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలపై ప్రత్యేక మానిటరింగ్
* 85 ఏళ్లు దాటిన వారికి, వికలాంగులకు ఓట్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్
* పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణకు డ్రోన్ల వాడకం
* సోషల్ మీడియా పోస్టుల నియంత్రణకు ప్రత్యేక అధికారుల నియామకం
* ఫేక్ న్యూస్‌పై ఫ్యాక్ట్ చెక్ ఫెసిలిటీ పెట్టిస్తామన్న ఈసీఈ
* దేశంలో 48 వేల మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు
* స్టార్ క్యాంపెయినర్లకు ప్రత్యేక గైడ్‌లైన్స్
* కుల, మతాన్ని రెచ్చగొట్టేలా స్పీచ్‌లు ఇవ్వొద్దు.. ఓట్లు అడగొద్దని సూచన
* ఎన్నికల ప్రచారాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నపిల్లలు ఉండకూడదు
* సూర్యాస్తమయం తర్వాత బ్యాంక్‌ల క్యాష్ వ్యాన్లకు అనుమతి లేదు
* పార్టీల మిస్ లీడింగ్ యాడ్స్‌కు అనుమతి లేదు
* 2100 మంది ఎన్నికల అబ్జర్వర్లు
* 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు