Share News

ED : కేజ్రీవాల్‌కు బెయిల్‌ పొడిగించొద్దు

ABN , Publish Date - May 31 , 2024 | 04:29 AM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ బెయిల్‌ కోసం చేసుకున్న అభ్యర్థనను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తీవ్రంగా వ్యతిరేకించింది.

ED : కేజ్రీవాల్‌కు బెయిల్‌ పొడిగించొద్దు

  • కోర్టులో ఈడీ వాదనలు

న్యూఢిల్లీ, మే 30 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ బెయిల్‌ కోసం చేసుకున్న అభ్యర్థనను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తీవ్రంగా వ్యతిరేకించింది. అనారోగ్య కారణాలపై తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కేజ్రీవాల్‌ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై ప్రత్యేక న్యాయస్థానంలో ఈడీ గురువారం తన వాదనలు వినిపించింది. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన తర్వాత కేజ్రీవాల్‌ 67 బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొన్నారని, 30 ఇంటర్వ్యూలు ఇచ్చారని ఈడీ తెలిపింది. కేజ్రీవాల్‌ ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొంది. అనారోగ్యంగా ఉంటే ప్రచారం ఎలా చేస్తారని వాదించింది. కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేయవద్దని కోరింది. న్యాయస్థానం తదువరి విచారణను జూన్‌ 1కి వాయిదా వేసింది.

Updated Date - May 31 , 2024 | 06:31 AM