Share News

2024 Lok Sabha Elections: ఈసీ హైఅలర్ట్.. తప్పకుండా ఆ పనిని మూడుసార్లు చేయాల్సిందే!

ABN , Publish Date - Mar 16 , 2024 | 04:44 PM

తమతమ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తున్నారు? ఆ అభ్యర్థి చరిత్ర ఏంటి? క్రిమినల్ రికార్డ్ (Criminal Record) కలిగి ఉన్నాడా? అనే వివరాలను తెలుసుకోవడానికి ‘Know Your Candidate’ అనే అప్లికేషన్‌ ఓటర్ల కోసం అందుబాటులోకి ఉందని రాజీవ్ కుమార్ తెలిపారు. ఆ అభ్యర్థుల ఆస్తుల దగ్గర నుంచి కేసుల వివరాల దాకా.. ప్రతి విషయం అందులో ఉంటాయని తెలిపారు.

2024 Lok Sabha Elections: ఈసీ హైఅలర్ట్.. తప్పకుండా ఆ పనిని మూడుసార్లు చేయాల్సిందే!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన నిరీక్షణకు చెక్ పెడుతూ కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission Of India - ECI) శనివారం (16/03/24) మధ్యాహ్నం లోక్‌సభ ఎన్నికల (2024 Lok Sabha Elections) షెడ్యూల్‌ని ప్రకటించింది. మొత్తం ఏడు దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించబడతాయని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఈసీఐ ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ (ECI Commissioner Rajiv Kumar) వెల్లడించారు. ఇదే సమయంలో ఆయన క్రిమినల్ రికార్డ్ కలిగిన అభ్యర్థుల గురించి కొన్ని కీలక విషయాలు తెలిపారు.


తమతమ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తున్నారు? ఆ అభ్యర్థి చరిత్ర ఏంటి? క్రిమినల్ రికార్డ్ (Criminal Record) కలిగి ఉన్నాడా? అనే వివరాలను తెలుసుకోవడానికి ‘Know Your Candidate’ అనే అప్లికేషన్‌ ఓటర్ల కోసం అందుబాటులోకి ఉందని రాజీవ్ కుమార్ తెలిపారు. ఆ అభ్యర్థుల ఆస్తుల దగ్గర నుంచి కేసుల వివరాల దాకా.. ప్రతి విషయం అందులో ఉంటాయని తెలిపారు. ఒకవేళ ఓ అభ్యర్థి క్రిమినల్ రికార్డ్ కలిగి ఉంటే.. ఆ వివరాలను అతను తప్పకుండా న్యూస్ పేపర్లు, టీవీలకు మూడుసార్లు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. అలాగే.. క్రిమినల్ రికార్డ్ కలిగిన అభ్యర్థిని ఏ ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో పోటీకి రంగంలోకి దింపాలన్న వివరణ రాజకీయ పార్టీలు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు.

అంతేకాదు.. అవినీతి అక్రమాలను అరికట్టేందుకు తాము ఓటర్ల సహకారంతో సాంకేతికతను వినియోగించుకోవాలని అనుకుంటున్నామని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఓటర్లకు ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే.. ‘సీ-విజిల్’ యాప్‌ని ఉపయోగించాలని కోరారు. డబ్బులు పంచుతున్నా, ఉచితాలు సరఫరా చేస్తున్నా, నియమాలకు విరుద్ధంగా ప్రచారం నిర్వహిస్తున్నా.. వెంటనే ఒక ఫోటో తీసి, యాప్‌లో తమకు ఫిర్యాదు అందజేయాలని అన్నారు. అప్పుడు మొబైల్ లొకేషన్ ఆధారంగా.. ఆ ప్రాంతానికి తమ బృందాన్ని 100 నిమిషాల్లోపే పంపిస్తామని.. వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 16 , 2024 | 04:44 PM