Share News

Lok Sabha Elections: డీఎంలతో అమిత్‌షా మంతనాలు.. జైరామ్‌ రమేష్‌కు ఈసీ లేఖ

ABN , Publish Date - Jun 02 , 2024 | 04:25 PM

ఈనెల 4న లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ఉండగా 150 మంది జిల్లా మెజిస్ట్రేట్లు, కలెక్టర్లతో హోం మంత్రి అమిత్‌షా ఫోనులో మాట్లాడారంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరామ్ రమేష్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఇందుకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని ఆదివారం మధ్యాహ్నం 2 గంటల్లోగా తమకు షేర్ చేయాలని జైరామ్ రమేష్‌ను కోరింది.

Lok Sabha Elections: డీఎంలతో అమిత్‌షా మంతనాలు.. జైరామ్‌ రమేష్‌కు ఈసీ లేఖ

న్యూఢిల్లీ: ఈనెల 4న లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ఉండగా 150 మంది జిల్లా మెజిస్ట్రేట్లు, కలెక్టర్లతో హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) ఫోనులో మాట్లాడారంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరామ్ రమేష్ (Jairam Ramesh) చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ (Election commission) స్పందించింది. ఇందుకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని ఆదివారం మధ్యాహ్నం 2 గంటల్లోగా తమకు షేర్ చేయాలని జైరామ్ రమేష్‌ను కోరింది. ఈమేరకు ఆయనకు ఈసీ ఒక లేఖ రాసింది.


''ఎన్నికల కౌంటింగ్ అనేది ప్రతి రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) పవిత్ర బాధ్యత. బాధ్యత కలిగిన, అనుభవజ్ఞుడైన సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు దీనిపై అనుమానాలు లేవనెత్తేలా ఉన్నాయి. విస్తృత ప్రజా ప్రయోజనాల రీత్యా దీన్ని ఈసీ తక్షణం పరిష్కరించాల్సి ఉంటుంది. డీఎంలపై ఎలాంటి ప్రభావం పడినట్టు మా వద్ద సమాచారం లేనప్పటికీ రమేష్ అంత బలంగా ఆరోపణలు చేసినందున ఆ వివరాలు అందిచాల్సిందింగా ఈసీ కోరుతోంది'' అని రమేష్‌కు రాసిన లేఖలో ఈసీ పేర్కొంది.


జైరామ్ రమేష్ ఏమన్నారంటే..

అమిత్‌షా ఇంతవరకూ 150 మంది డీఎంలు, కలెక్టర్లతో మాట్లాడారనీ, బీజేపీ ఎంత నిరాశానిస్పృహల్లో ఉందో దీనిని బట్టే తెలుస్తోందని జైరామ్ రమేష్ శనివారంనాడు వ్యాఖ్యానించారు. జూన్ 4న ప్రజల మనోభీష్టం వెల్లడికానుందని, మోదీ, షా, బీజేపీకి ఉద్వాసన, ఇండియా జనబంధన్ విజయం సాధిస్తుందని అన్నారు. అధికారులు ఎలాంటి ఒత్తిడికి లోను కారాదని, రాజ్యాంగాన్ని తప్పనిసరిగా పరిరక్షించాల్సి ఉంటుందన్నారు.

Updated Date - Jun 02 , 2024 | 04:25 PM