Share News

Delhi-Earthquake: ఢిల్లీలో భారీ భూకంపం..

ABN , Publish Date - Jan 11 , 2024 | 03:53 PM

న్యూఢిల్లీ, జనవరి 11: దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిసరాలు భూప్రకంపనలతో వణికిపోయాయి. దాంతో భయాందోళకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి, ఆఫీసుల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.

Delhi-Earthquake: ఢిల్లీలో భారీ భూకంపం..
Delhi-Earthquake

న్యూఢిల్లీ, జనవరి 11: దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిసరాలు భూప్రకంపనలతో వణికిపోయాయి. దాంతో భయాందోళకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి, ఆఫీసుల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. కాగా, ఢిల్లీ ఒక్కటే కాకుండా.. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లోనూ భూప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది.


పాకిస్తాన్‌లోనూ భూకంపం..

భారతదేశంతో పాటు.. పాకిస్తాన్‌లోనూ భూప్రకంపనలు సంభవించాయి. లాహోర్, ఇస్లామాబాద్, కైబర్ పక్తుంక్వా పట్టణాల్లోనూ భూమి కంపించింది.


ఆఫ్ఘనిస్తాన్‌లోనూ భూకంపం..

ఆఫ్ఘనిస్తాన్‌లోనూ భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది.

Updated Date - Jan 11 , 2024 | 04:02 PM