Share News

Kavitha: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ షాక్..ఈసారి కూడా

ABN , Publish Date - Apr 09 , 2024 | 12:00 PM

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో జ్యుడీషియల్ కస్టడీ గడువు ఈరోజు ముగియడంతో తీహార్ జైలు నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత( BRS MLC K Kavitha) కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ ED కోర్టును కోరింది.

Kavitha: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ షాక్..ఈసారి కూడా

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో జ్యుడీషియల్ కస్టడీ గడువు ఈరోజు ముగియడంతో తీహార్ జైలు నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత( BRS MLC K Kavitha) కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ ED కోర్టును కోరింది. అందుకు అనుకూలంగా స్పందించిన కోర్టు మరో 14 రోజుల కస్టడీ గడువు పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కవిత ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు.


14 రోజుల కస్టడీని కోరిన దర్యాప్తు సంస్థ కవిత సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని కోర్టుకు తెలిపింది. ఆ క్రమంలో సాక్ష్యాలను తారుమారు చేశారని వెల్లడించింది. ఈ క్రమంలో దర్యాప్తు కోసం మరింత సమయం కావాలని కోర్టును కోరగా అందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. మరోవైపు ఇది పూర్తిగా స్టేట్‌మెంట్‌పై ఆధారపడిన రాజకీయపరమైన కేసు అని కవిత ఆరోపించారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన కేసు అని, సీబీఐ ఇప్పటికే జైల్లో తన వాంగ్మూలాన్ని నమోదు చేశారని కవిత అన్నారు. కోర్టు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన తర్వాత ఆమె వెల్లడించారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం నుంచి ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆమెను మార్చి 23 వరకు ED కస్టడీలో ఉంచి, తర్వాత 3 రోజులు పెంచారు. ఆ క్రమంలో మార్చి 26న ఢిల్లీలోని అవెన్యూ కోర్టు కవితకు ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ కస్టడీకి విధించింది. అప్పటి నుంచి కవిత తీహార్ జైలులో ఉన్నారు.


ఇది కూడా చదవండి

Gold and Silver Prices: పండుగ వేళ మళ్లీ పెరిగిన పసిడి రేట్లు..ఈసారి ఏంతంటే

అవినీతిపరులు జైలుకే!

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 09 , 2024 | 12:24 PM