Share News

Delhi Liquor Scam Case: కేజ్రీవాల్‌కు నిరాశ..

ABN , Publish Date - Apr 11 , 2024 | 07:54 AM

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు(Kejriwal) సుప్రీంకోర్టులో(Supreme Court) తక్షణ ఊరట లభించలేదు. తన అరెస్టును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషన్‌ను వచ్చే సోమవారం పరిశీలిస్తామని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌..

Delhi Liquor Scam Case: కేజ్రీవాల్‌కు నిరాశ..
Deli Liquor Scam

  • ఆయన పిటిషన్‌పై అత్యవసర

  • విచారణకు సుప్రీం కోర్టు నిరాకరణ

  • వచ్చే సోమవారం పరిశీలిస్తామన్న సీజేఐ

  • అరెస్టును సమర్థించిన ఢిల్లీ హైకోర్టు

  • సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన కేజ్రీ

  • మంత్రి పదవికి ఆప్‌ నేత

  • రాజ్‌కుమార్‌ ఆనంద్‌ రాజీనామా

  • కేజ్రీవాల్‌ ప్రభుత్వం అవినీతిలో

  • కూరుకుపోయిందని ఆరోపణ

  • నవంబరులో ఆనంద్‌ ఇంట్లో ఈడీ సోదాలు

  • మంత్రి రాజీనామాతో

  • ఆప్‌ అవినీతి తేటతెల్లం: బీజేపీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు(Kejriwal) సుప్రీంకోర్టులో(Supreme Court) తక్షణ ఊరట లభించలేదు. తన అరెస్టును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషన్‌ను వచ్చే సోమవారం పరిశీలిస్తామని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌.. కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది వివేక్‌ జైన్‌కు తెలిపారు. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ మార్చి 21న కేజ్రీవాల్‌ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, ఆయన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్‌ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, తన లాయర్లను కలిసేందుకు వారానికి ఐదుసార్లు అవకాశం ఇవ్వాలని కేజ్రీవాల్‌ చేసిన విజ్ఞప్తిని రౌస్‌ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఇప్పుడున్న ప్రకారం వారానికి రెండు సార్లు మాత్రమే కేజ్రీవాల్‌ తన లాయర్లను కలవొచ్చు.

ఆప్‌ మంత్రి రాజ్‌కుమార్‌ రాజీనామా..

సీఎం కేజ్రీవాల్‌ అరెస్టుతో పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి(ఆప్‌) భారీ షాక్‌ తగిలింది. ఢిల్లీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రాజ్‌కుమార్‌ ఆనంద్‌ బుధవారం మంత్రి పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ‘‘అవినీతికి వ్యతిరేకంగా ఆప్‌ జరిపిన పోరాటానికి ఆకర్షితుడినై ఆ పార్టీలో చేరాను. కానీ, ఇప్పుడు ఆ పార్టీ ప్రభుత్వమే కూరుకుపోయింది. అందువల్లే మంత్రి పదవికి, ఆ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా’’ అని చెప్పారు. గతేడాది నవంబరులో మనీలాండరింగ్‌ కేసులో రాజ్‌కుమార్‌ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. రాజ్‌కుమార్‌ అరెస్టుపై బీజేపీ స్పందిస్తూ.. ఆప్‌ మంత్రి రాజీనామా ఆ పార్టీ అవినీతిని తేటతెల్లం చేసిందని ఆరోపించింది. తమ ఎమ్మెల్యేలను బెదిరించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐలను వాడుకుంటోందని ఆప్‌ ఆరోపించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 11 , 2024 | 07:54 AM