Share News

Delhi Liquor Policy Case: ఆప్, కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఈడీ చార్జీషీట్ దాఖలు

ABN , Publish Date - May 17 , 2024 | 05:28 PM

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఈడీ శుక్రవారం ఛార్జీషీట్ దాఖలు చేసింది.

Delhi Liquor Policy Case: ఆప్, కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఈడీ చార్జీషీట్ దాఖలు

న్యూఢిల్లీ, మే 17: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఈడీ శుక్రవారం ఛార్జీషీట్ దాఖలు చేసింది. కేజ్రీవాల్‌ అరెస్ట్‌కు వ్యతిరేకంగా శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఆ క్రమంలో ఈడీ తరఫు న్యాయవాది ఎస్వీ రాజు తన వాదనలు వినిపించారు.


అంతకుముందు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది సింఘ్వీ తన వాదనలు వినిపించారు. అయితే ఈ వాదనలు నేటితో ముగిసే అవకాశాలున్నాయని తెలుస్తుంది. అయితే ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీపై ఆరోపణలున్నాయని.. ఈ నేపథ్యంలో ట్రైయిల్ కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేస్తామని ఈడీ తెలిపింది. ఇక ఈ వ్యవహారంలో కేజ్రీవాల్‌, హావాలా ఆపరేటర్ల మధ్య చర్చలు నడిచాయని పేర్కొంది. ఆ క్రమంలో హావాలా ఆపరేటర్లు.. వారి ఫోన్లను ధ్వంసం చేశారని సోలిసిటర్ జనరల్ ఈ సందర్బంగా కోర్టు తెలిపారు.


ఇదే కేసులో మార్చి 21వ తేదీన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. నాటి నుంచి ఆయన తీహాడ్ జైల్లోనే ఉన్నారు. అయితే ఎన్నికల వేళ తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను ఇటీవల మంజూరు చేసింది. జూన్ 1వ తేదీతో సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ ముగియనుంది. దీంతో జూన్ 2వ తేదీన లొంగి పోవాలంటూ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసిన విషయం విధితమే.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 17 , 2024 | 05:35 PM