Share News

Delhi LG Saxena: 'ఆప్' అటవీ శాఖలో అవినీతిపై సీబీఐ దర్యాప్తునకు ఎల్జీ గ్రీన్‌సిగ్నల్

ABN , Publish Date - Jan 03 , 2024 | 05:36 PM

అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్‌కు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. ఢిల్లీ ప్రభుత్వ అటవీ, వన్యప్రాణాల సంరక్షణ శాఖలో ఇద్దరు అధికారులు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై దర్యాప్తునకు సీబీఐకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా బుధవారంనాడు అనుమతి ఇచ్చారు.

Delhi LG Saxena: 'ఆప్' అటవీ శాఖలో అవినీతిపై సీబీఐ దర్యాప్తునకు ఎల్జీ గ్రీన్‌సిగ్నల్

న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సారథ్యంలోని 'ఆమ్ ఆద్మీ పార్టీ' (AAP) సర్కార్‌కు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. ఢిల్లీ ప్రభుత్వ అటవీ, వన్యప్రాణాల సంరక్షణ శాఖలో ఇద్దరు అధికారులు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై దర్యాప్తునకు సీబీఐకు లెఫ్టినెంట్ గవర్నర్ (LG) వీకే సక్సేనా (VK Saxena) బుధవారంనాడు అనుమతి ఇచ్చారు. ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన ఇద్దరు మహిళా హెల్త్ ఆఫీసర్లు లంచం తీసుకున్నారనే ఆరోపణలపై ఏసీబీ, జీఎన్‌సీటీడీ దర్యాప్తు కొనసాగించేందుకు కూడా ఎల్జీ అనుమతించారు.


ఈడీ సమన్లకు కేజ్రీవాల్ గైర్హాజర్

కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మూడోసారి జారీ చేసిన సమన్లను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారంనాడు మరోసారి దాటవేశారు. దీనికి ముందు నవంబర్ 2, డిసెంబర్ 21 తేదీల్లో ఈడీ రెండుసార్లు సమన్లు జారీ చేసింది. ఈడీ విచారణకు సహకరించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నప్పటికీ నోటీసు చట్టవిరుద్ధంగా ఉన్నందునే ఆయన హాజరుకావడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, కేజ్రీవాల్ గైర్హాజర్‌పై బీజేపీ మరోసారి విమర్శలు గుప్పించింది. అడ్మినిస్ట్రేటివ్, న్యాయవ్యవస్థపై సీఎంకు నమ్మకం లేదనే విషయాన్ని కేజ్రీవాల్ గైర్హాజర్ చెప్పకనే చెబుతోందని బీజేపీ ఢిల్లీ విభాగం చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ్ ఆరోపించారు. సీఎంగా కొనసాగే హక్కు ఆయనకు లేదని అన్నారు.

Updated Date - Jan 03 , 2024 | 05:36 PM