Share News

Dead Man Comes Alive: అద్భుతం.. చచ్చిన వ్యక్తి బతికాడు, ఎలా అంటే..!

ABN , Publish Date - Jan 13 , 2024 | 11:37 AM

దేశంలో చాలాచోట్ల గతుకుల రహదారులు కనిపిస్తుంటాయి. ఇలాంటి రోడ్ల వల్ల చాలా ప్రమాదాలు జరిగాయి. అలా జరిగిన యాక్సిడెంట్లలో కొందరు చనిపోయారు. హర్యానాలో మాత్రం అద్భుతం జరిగింది. గుంతలు ఉన్న రహదారి వల్ల చనిపోయిన వ్యక్తి బతికాడు.

 Dead Man Comes Alive: అద్భుతం.. చచ్చిన వ్యక్తి బతికాడు, ఎలా అంటే..!

చండీగఢ్: దేశంలో చాలాచోట్ల గతుకుల రహదారులు కనిపిస్తుంటాయి. ఇలాంటి రోడ్ల వల్ల చాలా ప్రమాదాలు జరిగాయి. అలా జరిగిన యాక్సిడెంట్లలో కొందరు చనిపోయారు. మరికొన్ని ఘటనల్లో ఇంకొందరు గాయపడ్డారు. హర్యానాలో (Haryana) మాత్రం ఓ అద్భుతం జరిగింది. గుంతలు ఉన్న రహదారి వల్ల చనిపోయిన వ్యక్తి (Dead Man) బతికాడు. ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

కర్నాల్ సమీపంలో గల నిసింగ్‌లో దర్శన్ సింగ్ బ్రార్ (80) కుటుంబం ఉంటుంది. కాలనీలో అతనికి మంచి పేరు ఉంది. అందుకే కాలనీ వాసులు తమ వీధికి సింగ్ పేరుకున్నారు. సింగ్ ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో పాటియాలాలో ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. నాలుగు రోజుల నుంచి వెంటిలేటర్ మీద ఉన్నాడని అతని మనమడు బల్వాన్ వివరించారు. గురువారం ఉదయం వైద్యులు వచ్చి సింగ్ గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని, వెంటిలేటర్ తీసివేస్తే చనిపోతారని చెప్పారని తెలిపారు. దాంతో గ్రామంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

పాటియాలా నుంచి అంబులెన్స్‌లో సింగ్ మృతదేహాం తీసుకొస్తున్నారు. అంబులెన్స్ ఖైతల్‌కు వచ్చిన తర్వాత రహదారి గుంతలతో ఉంది. గతుకులు ఉండటంతో అంబులెన్స్ ఊగుతూ నడిచింది. దాంతో దర్శన్ సింగ్‌ స్పందించారు. మెల్లిగా శ్వాస తీసుకోవడం ప్రారంభించారు. చేయి కదలడం గమనించిన మనమడు వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని అంబులెన్స్ డ్రైవర్‌ను కోరారు. ఆస్పత్రిలో వైద్యులు పరిశీలించి సింగ్ బతికే ఉన్నాడని ప్రకటించారు. దీంతో సింగ్ కుటుంబ సభ్యులు తెగ ఆనంద పడ్డారు. అద్భుతం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 13 , 2024 | 11:37 AM