Share News

Dawood Ibrahim: అండర్ వరల్డ్ డాన్ ఆస్తుల వేలం, 4 ప్లాట్ల బిడ్ ఎంతంటే..?

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:32 AM

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం ఈ రోజు జరగనుంది. అతని స్వగ్రామం ముంబెకేలో ఉన్న నాలుగు ప్లాట్లు ఈ వేలం ద్వారా జరగనుంది. దావూద్ ఇబ్రహీం పుట్టి పెరిగింది మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలో గల ముంబెకేలో అనే సంగతి తెలిసిందే.

 Dawood Ibrahim: అండర్ వరల్డ్ డాన్ ఆస్తుల వేలం, 4 ప్లాట్ల బిడ్ ఎంతంటే..?

రత్నగిరి: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) ఆస్తుల వేలం ఈ రోజు జరగనుంది. అతని స్వగ్రామం ముంబెకేలో ఉన్న నాలుగు ప్లాట్లు ఈ వేలం ద్వారా జరగనుంది. దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) పుట్టి పెరిగింది మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలో గల ముంబెకేలో అనే సంగతి తెలిసిందే. 1970లో ముంబై వచ్చే వరకు అండర్ వరల్డ్ డాన్ ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత నేర ప్రపంచంలో అడుగిడాడు. క్రమ క్రమంగా డాన్‌గా ఎదిగాడు.

రూ.19 లక్షలకే నాలుగు ప్లాట్లు

ముంబెకేలో గల దావూద్ ఇబ్రహీంకు సంబంధించి నాలుగు ప్లాట్లు 21,275 చదరపు మీటర్ల స్థలానికి బిడ్‌గా రూ.19 లక్షలుగా అధికారులు నిర్ణయించారు. ఈ ఫ్లాట్లు వ్యవసాయ భూములేనని పేర్కొన్నారు. ఇప్పుడే కాదు నాలుగేళ్ల క్రితం కూడా దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) ఆస్తులను వేలం వేశారు. 2020లో దావూద్ (Dawood) నివాసం, ఐదు ఇతర ఆస్తుల వేలం జరిగింది. లోతేలో గల మరో ప్లాట్ మాత్రం సాంకేతిక కారణాల వల్ల వేలం జరగలేదు. 2017లో కూడా దక్షిణ ముంబైలో గల మూడు ఆస్తులు (గెస్ట్ హౌస్, హోటల్, ఇల్లు) వేలం జరిగింది.

వేలంలో పాల్గొనేది ఇతనే

దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) ఆస్తుల వేలంలో శివసేన నేత, న్యాయవాది అజయ్ శ్రీవాస్తవ (Ajay Srivastava) పాల్గొనే అవకాశం ఉంది. ఇదివరకు కూడా ఆయన బిడ్ వేశారు. 2001లో షాప్ కోసం బిడ్ వేసిన సంగతి తెలిసిందే. సాంకేతిక కారణాలతో ఇప్పటికీ స్వాధీన ప్రక్రియ జరగలేదు. త్వరలో దావూద్ (Dawood) ఇల్లును తీసుకొని.. అందులో సంస్థాన పాఠశాల నెలకొల్పుతానని చెబుతున్నారు. మరి ఈ రోజు ఆ ప్లాట్లను ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

కరాచీలో ఉన్న దావూద్..?

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) ప్రస్తుతం కరాచీలో ఉన్నట్టు తెలిసింది. దేశంలో జరిగిన పలు దాడులతో అతనికి సంబంధం ఉంది. 1993లో ముంబై వరస బాంబ్ బ్లాస్ట్ జరిపింది దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) అనుచరలేనని పోలీసులు (Police) చెబుతున్నారు. ఆ తర్వాత దుబాయ్, ఇప్పుడు పాకిస్థాన్‌లో దావూద్ (Dawood) తలదాచుకున్నాడు. ఇటీవల విష ప్రయోగం జరిగిందని, ఆస్పత్రిలో ఉన్నారని వార్తలు వచ్చాయి. అదేం లేదని.. తమ బాస్ ఫిట్‌గా ఉన్నారని డి కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

Updated Date - Jan 05 , 2024 | 11:32 AM