Share News

Cyber Criminals: మూడేళ్లలో దేశంలో సైబర్ నేరగాళ్లు ఎన్ని కోట్లు దోచుకున్నారో తెలుసా?

ABN , Publish Date - Jan 05 , 2024 | 07:48 PM

సైబర్ నేరగాళ్లు(cyber criminals) రోజురోజుకు కొత్త కొత్తగా ప్లాన్స్ వేస్తూ కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత మూడేళ్లలో దేశంలో 10 వేల కోట్లకుపైగా దోచుకున్నారని ఓ నివేదిక వెల్లడించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Cyber Criminals: మూడేళ్లలో దేశంలో సైబర్ నేరగాళ్లు ఎన్ని కోట్లు దోచుకున్నారో తెలుసా?

దేశంలో ఇటివల ప్రకటించిన సైబర్ క్రైం రిపోర్టులో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అయితే సైబర్ నేరగాళ్లు(cyber criminals) కేవలం మూడేళ్లలోనే దేశంలో 10 వేల కోట్ల రూపాయలకు పైగా దోచుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C లేదా ICCCC) ప్రకారం గత మూడేళ్లలో (ఏప్రిల్ 1, 2021 నుంచి డిసెంబర్ 31, 2023 వరకు) సైబర్ నేరగాళ్లు దేశం(India)లో రూ.10,300 కోట్లకు పైగా దోచుకున్నారు. అయితే ఇదే కాలంలో దాదాపు రూ.1,127 కోట్లను మన పోలీసులు లేదా ఏజేన్సీలు విజయవంతంగా కట్టడిచేశారు. అంటే దోచుకున్న సొమ్ములో 9 నుంచి 10 శాతం మాత్రమే తిరిగి బాధితుల ఖాతాల్లోకి చేరాయి.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Gorakhpur Case: రాత్రి పేరెంట్స్‌కి నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో రొమాన్స్.. చివరికి ఏమైందంటే?


ఈ క్రమంలోనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో మూడేళ్లలో 29.74 లక్షల సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయని రిపోర్టులో ప్రకటించారు. సైబర్ నేరగాళ్ల వివరాలను తెలియజేసిన అధికారులు(Officers) కంబోడియా, వియత్నాం, చైనా తదితర దేశాల నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్న గ్యాంగ్‌ల ద్వారా దాదాపు 50 శాతం సైబర్‌ దాడులు జరిగాయని వెల్లడించారు. అంతేకాదు భారతదేశంలోని జమ్తారా దేవఘర్ నుంచి కూడా సైబర్ నేరాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. గత నెలలో ఇక్కడి నుంచి 454 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి క్రమంలో ప్రజలు రోజురోజుకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దీంతోపాటు వాట్సాప్, టెలిగ్రామ్ వంటి గ్రూపులలో తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులు లేదా సమాచారాన్ని క్లిక్ చేయోద్దని కోరారు.

Updated Date - Jan 05 , 2024 | 07:48 PM