Share News

Crocodile: వరి పొలంలో మొసలి ప్రత్యక్షం.. బెంబేలెత్తిన రైతులు

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:30 PM

వరిపొలంలో మొసలి(Crocodile) ప్రత్యక్షం కావడంపై రైతులు బెంబేలెత్తారు. సిరిగేరి సమీపంలోని గుండిగనూరు గ్రామం దేవన్నగౌడ పొలంలో శుక్రవారం ఉదయం వరి పొలంలో మొసలి ప్రత్యక్షమైంది.

Crocodile: వరి పొలంలో మొసలి ప్రత్యక్షం.. బెంబేలెత్తిన  రైతులు

కంప్లి(బెంగళూరు): వరిపొలంలో మొసలి(Crocodile) ప్రత్యక్షం కావడంపై రైతులు బెంబేలెత్తారు. సిరిగేరి సమీపంలోని గుండిగనూరు గ్రామం దేవన్నగౌడ పొలంలో శుక్రవారం ఉదయం వరి పొలంలో మొసలి ప్రత్యక్షమైంది. రైతు దేవన్నగౌడ తీవ్ర భయాందోళన చెందారు. యథావిధిగా పొలానికి రైతు కోతకు వచ్చిన వరి పంటను చూసేందుకు వెళ్లారు. రైతు వాగు పక్కలో నుండి వెళుతుండగా మొసలి పొలంలో కనిపించడంతో వెంటనే అటవీ అధికారులకు తెలియజేశారు. అక్కడికి చేరుకున్న అధికారులు మొసలిని బంధించి నదిలో వదిలేశారు. రైతులు జాగ్రత్త వహించాలని అధికారులు హెచ్చరించారు.

pandu1.jpg

ఇదికూడా చదవండి: Kanimozhi: ప్రస్తుతం జరుగుతున్నవి లోక్‌సభ ఎన్నికలు కావు.. మరో స్వాతంత్య్ర సంగ్రామం.. ఆలోచించండి!

Updated Date - Apr 05 , 2024 | 12:30 PM