Share News

Covid: వామ్మో బాగానే పెరిగాయిగా.. 260 మందికి కొవిడ్‌ పాజిటివ్‌

ABN , Publish Date - Jan 04 , 2024 | 09:19 AM

రాష్ట్రంలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం 260 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 228 మంది కోలుకోగా ఒకరు మృతి చెందారు. 1175 మంది చికిత్సలు పొందుతుండగా హోం ఐసొలేషన్‌లో 1107 మంది, ఆసుపత్రిలో 68 మంది ఉన్నారు.

Covid: వామ్మో బాగానే పెరిగాయిగా.. 260 మందికి కొవిడ్‌ పాజిటివ్‌

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం 260 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 228 మంది కోలుకోగా ఒకరు మృతి చెందారు. 1175 మంది చికిత్సలు పొందుతుండగా హోం ఐసొలేషన్‌లో 1107 మంది, ఆసుపత్రిలో 68 మంది ఉన్నారు. బెంగళూరులో 134 మంది, మైసూరులో 24, బెంగళూరు గ్రామీణ 20 మంది, శివమొగ్గలో 11 మందికి వైరస్‌ ప్రబలగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ పదిలోపు కేసులు నమోదయ్యాయి.

రాయచూరులో డాక్టర్‌ సహా నలుగురికి..

రాయచూరు : గడిచిన రెండు వారాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌ కేసులు పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో జిల్లాలోనూ నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయిన ట్లు బుధవారం అధికారులు ప్రకటించారు. రాయచూరు నగరంలోని ఒక వైద్యుడితో పాటు మాన్వి తాలూకా బ్యాగవాట్‌, మాడగిరి, మాన్వి పట్టణంలో ఒక్కొక్కరికి పాజిటివ్‌ ఉన్నట్లు పరీక్షల్లో నిర్థారణ అయింది. ఈ నలుగురికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రిలో ఇప్పటి వరకు 582 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా దగ్గు, జ్వరం, జలుబు ఉన్న వారిని ప్రత్యేకంగా పరీక్షిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయిన పక్షంలో రిమ్స్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సౌకర్యంతో కూడిన 20 పడకల ఐసీయూ కేంద్రాన్ని సిద్ధం చేసి ఉంచినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పాటు ప్రతి తాలూకా కేంద్రంలో ఆక్సిజన్‌ సౌకర్యంతో కూడిన 10 ఐసీ యూ పడకలను అందుబాటులో ఉంచామన్నారు. కాగా ప్రస్తుతం వస్తున్న వేరియంట్‌ వల్ల ఎలాంటి ప్రాణపాయం లేకపోయినా ప్రజలు తగిన జాగ్రతలు పాటించాలని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Jan 04 , 2024 | 09:19 AM