Share News

Narendra Modi: బీజేపీ గెలిస్తే దేశం భగ్గుమంటుందని బెదిరిస్తున్న కాంగ్రెస్: మోదీ

ABN , Publish Date - Apr 02 , 2024 | 05:48 PM

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దేశం భగ్గుమంటుందని కాంగ్రెస్ పార్టీ నేతలు బెదిరిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 'ఆత్మనిర్భర్ భారత్' కలల సాకారానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, అవినీతిని నిర్మూలించాలని మోదీ చెబుతుంటే, అవినీతిని కాపాడంటంటూ వారు చెబుతున్నారని ప్రధాని విమర్శలు గుప్పించారు.

Narendra Modi: బీజేపీ గెలిస్తే దేశం భగ్గుమంటుందని బెదిరిస్తున్న కాంగ్రెస్: మోదీ

కోట్‌పుత్లి: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) బీజేపీ గెలిస్తే దేశం భగ్గుమంటుందని (Arson) కాంగ్రెస్ పార్టీ నేతలు బెదిరిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 'ఆత్మనిర్భర్ భారత్' కలల సాకారానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, అవినీతిని నిర్మూలించాలని మోదీ చెబుతుంటే, అవినీతిని కాపాడంటంటూ వారు (Congress) చెబుతున్నారని ప్రధాని విమర్శలు గుప్పించారు. రాజస్థాన్‌ (Rajasthan)లోని కోట్‌పుత్లిలో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో గెలుపు గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ పోటీ చేస్తున్న తొలి ఇన్నికలు ఇవని, బీజేపీ గెలిస్తే మాత్రం దేశం తగులబడుతుందని బెదిరిస్తోందని ఎద్దేవా చేశారు.


బీజేపీకి దేశమే కుటుంబం

దేశమంతా ఒకే కుటుంబ భావనతో బీజేపీతో ఉందని, కాంగ్రెస్ మాత్రం దేశం కంటే తమ కుటుంబమే పెద్దదిని భావిస్తోందని మోదీ అన్నారు. దేశ కీర్తిని పెంపొందించేందుకు బీజేపీ కృషి చేస్తుంటే, కాంగ్రెస్ మాత్రం ఎప్పుడు విదేశాలకు వెళ్లినా దేశ ప్రతిష్ఠను దిగజారుస్తూ వస్తోందని మండిపడ్డారు. మోదీ పుట్టింది ఎంజాయ్ చేయడానికి కాదని, కష్టించి పనిచేయడానికి తెలిపారు. గత పదేళ్లలో ఎంతో చేశామని, అది కూడా ఒక ట్రయిలర్ మాత్రమేనని అన్నారు.


60 ఏళ్ల పేదరికానికి కాంగ్రెస్సే కారణం..

స్వాతంత్ర్యానంతరం 60 ఏళ్ల పాటు దేశం పేదరికంలో మగ్గడానికి కాంగ్రెస్సే కారణమని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ కారణంగానే సాంకేతికత, రక్షణ సామాగ్రి కోసం ఇతర దేశాలపై భారత్ ఆధారపడాల్సి వచ్చిందన్నారు. మన సాయుధ బలగాలను ఎన్నడూ ఆత్మనిర్భర్‌గా మార్చలేదని, కాంగ్రెస్ పాలనలో ఆయుధాల దిగుమతిలో అతిపెద్ద దిగుమతిదారుగా భారత్ నిలిచిందని చెప్పారు. అందుకు భిన్నంగా ఇప్పుడు బీజేపీ హయాంలో ఆయుధాల ఎగుమతిదారుగా భారత్ నిలిచిందన్నారు. కాగా, రాజస్థాన్‌లో లోక్‌సభ ఎన్నికలు రెండు విడతల్లో ఏప్రిల్ 19, 26 తేదీల్లో జరుగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 02 , 2024 | 05:48 PM