Share News

BJP: బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపులకు కేరాఫ్ కాంగ్రెస్.. మండిపడ్డ ప్రధాని మోదీ

ABN , Publish Date - Feb 24 , 2024 | 04:25 PM

కాంగ్రెస్(INC) అంటేనే బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపులకు కేరాఫ్ అని ప్రధాని మోదీ(PM Modi) మండిపడ్డారు. దేశాభివృద్ధి ఆ పార్టీ అజెండాలోనే లేదని తూర్పారబట్టారు. విక్షిత్ భారత్, విక్షిత్ ఛత్తీస్‌గఢ్ కార్యక్రమంలో భాగంగా మోదీ రాయ్‌పుర్‌లో పర్యటించారు.

BJP: బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపులకు కేరాఫ్ కాంగ్రెస్.. మండిపడ్డ ప్రధాని మోదీ

రాయ్‌పుర్: కాంగ్రెస్(INC) అంటేనే బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపులకు కేరాఫ్ అని ప్రధాని మోదీ(PM Modi) మండిపడ్డారు. దేశాభివృద్ధి ఆ పార్టీ అజెండాలోనే లేదని తూర్పారబట్టారు.

విక్షిత్ భారత్, విక్షిత్ ఛత్తీస్‌గఢ్ కార్యక్రమంలో భాగంగా మోదీ రాయ్‌పుర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా రూ.34,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ.. "స్వాతంత్ర్యం వచ్చాక చాలా ఏళ్లు కాంగ్రెస్ పాలించింది. ఆ పార్టీ దృష్టి ఎప్పుడూ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంపైనే ఉండేది. దేశ భవిష్యత్తుపై ఆ పార్టీ నాయకులకు పట్టింపు లేదు. కాంగ్రెస్ ఎప్పుడూ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికీ కాంగ్రెస్ దశ, దిశ మారలేదు. బంధుప్రీతి, అవినీతి, అలకలు, బుజ్జగింపులు ఇవి తప్పా వేరే విషయంపై ఆలోచించదు. కాంగ్రెస్ నేతలు వారి కుమారులు, కుమార్తెల రాజకీయ భవిష్యత్తును రూపొందించడంలో బిజీగా ఉన్నారు. పేద ప్రజల కుమారులు, కుమార్తెల గురించి వారు ఎప్పుడూ ఆలోచించరు. దేశ ప్రజలంతా మోదీ కుటుంబ సభ్యులు. అందుకే దేశ అభివృద్ధి గురించే నేను, మా పార్టీ నేతలు మాట్లాడుతుంటారు. పేదలు, యువత, మహిళా సాధికారతతోనే అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించవచ్చు. ఛత్తీ‌స్‌గఢ్‌లో గత కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల పథకాన్ని నిలిపేసింది. మా ప్రభుత్వం ఆ పనుల్ని వేగవంతం చేసింది" అని మోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయ్, మంత్రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 24 , 2024 | 04:27 PM