Share News

Kolakata: హెలికాప్టర్‌లో జారిపడ్డ మమత

ABN , Publish Date - Apr 28 , 2024 | 03:04 AM

పశ్చిమబెంగాల్‌ సీఎం మమత మరోసారి గాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బర్ధమాన్‌ జిల్లాలోని దుర్గాపూర్‌ నుంచి అసన్‌సోల్‌కు వెళ్లేందుకు శనివారం ఆమె హెలికాప్టర్‌ ఎక్కారు.

Kolakata: హెలికాప్టర్‌లో జారిపడ్డ మమత

కోల్‌కతా, ఏప్రిల్‌ 27: పశ్చిమబెంగాల్‌ సీఎం మమత మరోసారి గాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బర్ధమాన్‌ జిల్లాలోని దుర్గాపూర్‌ నుంచి అసన్‌సోల్‌కు వెళ్లేందుకు శనివారం ఆమె హెలికాప్టర్‌ ఎక్కారు. లోపలికి వెళ్లి తన సీటులో కూర్చునే సమయంలో అదుపు తప్పి పడిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆమెను పైకి లేపారు. స్వల్ప గాయాలైనప్పటికీ దీదీ అసన్‌సోల్‌కు వెళ్లి పార్టీ అభ్యర్థి శతృఘ్న సిన్హాకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇటీవలే మమత తన నివాసంలో జారిపడగా.. ఆమె నుదుటికి గాయమైంది.

Updated Date - Apr 28 , 2024 | 07:04 AM