Share News

Chief Minister: శివకుమారస్వామికి ‘భారత రత్న’ ఇవ్వండి..

ABN , Publish Date - Feb 04 , 2024 | 11:07 AM

లక్షలాదిమంది నిరుపేదలకు కుల, మత భేదాలు లేకుండా విద్య, వసతి, భోజనం కల్పించి నడిచే దేవుడిగా కీర్తి పొందిన తుమకూరు సిద్దగంగా మఠాధిపతి డాక్టర్‌ శివకుమారస్వామి(Dr. Sivakumaraswamy)కి భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) డిమాండ్‌ చేశారు.

Chief Minister: శివకుమారస్వామికి ‘భారత రత్న’ ఇవ్వండి..

- ముఖ్యమంత్రి సిద్దరామయ్య

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): లక్షలాదిమంది నిరుపేదలకు కుల, మత భేదాలు లేకుండా విద్య, వసతి, భోజనం కల్పించి నడిచే దేవుడిగా కీర్తి పొందిన తుమకూరు సిద్దగంగా మఠాధిపతి డాక్టర్‌ శివకుమారస్వామి(Dr. Sivakumaraswamy)కి భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) డిమాండ్‌ చేశారు. దావణగెరెలో సీఎం మీడియాతో మాట్లాడుతూ శివకుమారస్వామికి కూడా భారతరత్న గౌరవం ఇవ్వాలన్నారు. మరణానంతరం ఆయనకు భారతరత్నతో గౌరవించడం సముచితంగా ఉంటుందన్నారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖ రాస్తామని సీఎం తెలిపారు. విజయపురలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ ఎల్‌కే ఆడ్వాణీ దేశంలో సీనియర్‌ రాజకీయ నేత అన్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వడంలో తమకెటువంటి అభ్యంతరం లేదన్నారు. రాష్ట్రానికి చెందిన నడిచే దేవుడిగా పేరొందిన శివకుమారస్వామికి అదే గౌరవం దక్కాలన్నారు. గతంలోనే స్వామిజీకి భారతరత్న ఇవ్వాలని విన్నవించామన్నారు. పేదలకు అన్నదానం చేయడంలో స్వామిజీకి ప్రత్యేకమైన పేరుందన్నారు. పేద చిన్నారులను ప్రపంచ వ్యాప్తంగా రాణించేలా తీర్చిన ఘనత స్వామిజీదే అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీ్‌పసింగ్‌ సుర్జేవాలా ఒక ప్రకటన విడుదల చేస్తూ.. అన్నం, అక్షర జ్ఞానం, వసతి కల్పించిన మహాపురుషుడు శివకుమారస్వామిజీకి భారతరత్న లభించాలన్నారు. ఈ గౌరవానికి ఆయనలాంటి అర్హులు మరొకరు లేరన్నారు. ఇప్పటికే స్వామిజీకి భారతరత్న దక్కాల్సి ఉండేదన్నారు.

Updated Date - Feb 04 , 2024 | 11:07 AM