Share News

Chennai: ఆ ఇద్దరి మధ్య విభేదాలు.. తమిళనాడులో మళ్లీ.. గవర్నర్‌ X సర్కార్‌

ABN , Publish Date - Feb 13 , 2024 | 04:48 AM

తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగంపై వివాదం చోటుచేసుకుంది. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని తన ఇష్టానుసారంగా మార్చుకుని చదివిన గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి.. ఈ ఏడాది ప్రసంగ పాఠాన్ని క్లుప్తంగా చదివి, ఆపై ప్రభుత్వం, స్పీకర్‌పై కొన్ని వ్యాఖ్యలు చేసి కూర్చుండిపోయారు.

Chennai: ఆ ఇద్దరి మధ్య విభేదాలు.. తమిళనాడులో మళ్లీ.. గవర్నర్‌ X సర్కార్‌

  • అసెంబ్లీలో ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించిన గవర్నర్‌

  • ప్రభుత్వం, స్పీకర్‌పై విమర్శలు.. సభలో రసాభాస

చెన్నై, (ఆంధ్రజ్యోతి): తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగంపై వివాదం చోటుచేసుకుంది. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని తన ఇష్టానుసారంగా మార్చుకుని చదివిన గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి.. ఈ ఏడాది ప్రసంగ పాఠాన్ని క్లుప్తంగా చదివి, ఆపై ప్రభుత్వం, స్పీకర్‌పై కొన్ని వ్యాఖ్యలు చేసి కూర్చుండిపోయారు. దీంతో సభ దిగ్ర్భాంతికి లోనైంది. స్పీకర్‌ అప్పావు మైకు తీసుకుని.. గవర్నర్‌ ప్రసంగం తమిళ అనువాదాన్ని చదివారు. చివరన ఆయన గవర్నర్‌పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. అనంతరం జాతీయ గీతాలాపన ఉంటుందని ప్రకటించారు. అయితే అప్పటి వరకూ అక్కడే కూర్చున్న గవర్నర్‌.. స్పీకర్‌ తనపై చేసిన వ్యాఖ్యల గురించి తెలుసుకుని జాతీయ గీతాలాపన ప్రారంభం కాబోతున్న సమయంలో లేచి వెళ్లిపోయారు. అనంతరం మంత్రి దురైమురుగన్‌ లేచి.. గవర్నర్‌ ప్రసంగ పాఠాన్ని యథాతథంగా ఆమోదిస్తూ తీర్మానం చేయగా, సభ్యులు మూజువాణి ఓటుతో ఆమోదించారు. అంతేగాక సభలో గవర్నర్‌, స్పీకర్‌ చేసిన కొన్ని వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగిస్తూ మరో తీర్మానం చేశారు. కాగా, సభలో జరిగిన వ్యవహారంపై రాజ్‌భవన్‌ వివరణ ఇచ్చింది. ప్రభుత్వం రూపొందించిన ప్రసంగంలో పలు అవాస్తవాలు, ప్రజలను తప్పుదారి పట్టించే అంశాలు ఉన్నాయన్నాయని పేర్కొంది. అయితే రాజ్‌భవన్‌ ప్రకటనను తమిళనాడు న్యాయశాఖ మంత్రి మూర్తి తీవ్రంగా ఖండించారు. గవర్నర్‌ ప్రసంగంలో ముందుగా ఎలాంటి మార్పులు చేర్పులు సూచించలేదన్నారు. ప్రసంగంలో అసత్యాలున్నాయని గవర్నర్‌ పేర్కొనడం సమంజసం కాదన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 08:34 AM