Share News

Army Chief : ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే పదవీకాలం పొడిగింపు

ABN , Publish Date - May 26 , 2024 | 07:59 PM

న్యూఢిల్లీ: ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీకాలాన్ని (Tenure) నెలరోజుల పాటు కేంద్రం పొడిగించింది. ఆయన పదవీకాలం పొడిగింపును కేబినెట్ అపాయింట్‌మెంట్ కమిటీ ఆదివారంనాడు ఆమోదం తెలిపింది.

Army Chief : ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే పదవీకాలం పొడిగింపు

న్యూఢిల్లీ: ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే (Manoj Pande) పదవీకాలాన్ని (Tenure) నెలరోజుల పాటు కేంద్రం పొడిగించింది. ఆయన పదవీకాలం పొడిగింపును కేబినెట్ అపాయింట్‌మెంట్ కమిటీ ఆదివారంనాడు ఆమోదం తెలిపింది. మే 31వ తేదీన ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా, జూన్ 30వ తేదీ వరకూ దానిని పొడిగించింది. ఆర్మీ రూల్స్-1954లోని రూల్ 16ఎ(4)కింద ఆయన పదవీకాలాన్ని పొడిగించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జనరల్ పాండే ఏప్రిల్ 2022న పదవీ బాధ్యతలు చేపట్టగా, అంతకుముందు ఆయన ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా ఉన్నారు.

Read National News and Latest News here

Updated Date - May 26 , 2024 | 07:59 PM