Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Aug 09 , 2024 | 07:15 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Update
-
2024-08-09T14:00:32+05:30
కవిత 11 కిలోల బరువు తగ్గింది: కేటీఆర్
హైదరాబాద్: కవిత జైలులో చాలా ఇబ్బందులు పడుతుంది.
ఇప్పటి వరకు 11 కిలోలు తగ్గింది.
బీపీ వచ్చింది. దాంతో రోజు రెండు టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది.
సిసోడియాకు బెయిల్ అంశం అనేది ఆలోచించి మాట్లాడాలి.
రాజకీయంగా పోరాడాల్సి వచ్చిన సమయంలో ఇలాంటివి తప్పవు.
కవిత బెయిల్ కోసం నిన్న అప్పీల్ చేశాం.
నెక్స్ట్ వీక్ వచ్చే అవకాశం ఉందని భాభిస్తున్నాం.
సిసోడియాకు వచ్చింది కాబట్టి మిగతా వాళ్లకు వస్తుందని భాభిస్తున్నాం.
ఖైదీలు 11 వేలు ఉండాల్సిన చోట 30 వేల మంది ఉన్నారు.
జైలు పరిశుభ్రంగా లేదు.
జైలుకు వెళ్లి వచ్చిన వాళ్ళు భవిష్యత్‌తో పెద్ద లీడర్లు అయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది: కేటీఆర్

-
2024-08-09T13:52:10+05:30
రంగంలోకి సాల్వే..
వినేశ్ ఫోగట్ కేసును సీఏఎస్ కోర్టులో వాదించనున్న హరీశ్ సాల్వే
హరీశ్ సాల్వే రంగంలోకి దిగడంతో మెడల్‌పై ఆశలు
దేశంలో ప్రముఖ న్యాయవాదిగా హరీశ్ సాల్వేకు గుర్తింపు
గతంలో కుల్‌భూషణ్ జాదవ్ కేసును అంతర్జాతీయ కోర్టులో వాదించిన సాల్వే
జాదవ్‌కు పాకిస్థాన్ మిలిటరీ కోర్టు ఉరిశిక్ష విధించింది.
రాజ్యాంగం, కమర్షియల్ టాక్స్ గురించి సాల్వేకు మంచి పట్టు ఉంది.

-
2024-08-09T13:35:54+05:30
సీతారామాపురంలో జగన్
నంద్యాల: మహనంది మండలం సీతారామాపురం చేరుకున్న మాజీ సీఎం జగన్
ఇటీవల హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్.
-
2024-08-09T13:31:21+05:30
గిరిజనులు ఎక్కువ ఉండే దేశం మనది: ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి: రాష్ట్రపతిగా ద్రౌపతి మర్ము ఉండటం మనందరికీ గర్వకారణం: ఏపీ సీఎం చంద్రబాబు
ఆఫ్రికా తర్వాత గిరిజనులు ఎక్కువగా ఉండే దేశం మనది
రాష్ట్రంలో 27 లక్షల మంది ఆదివాసులు ఉన్నారు
5 శాతం ఆదివాసీలు రాష్ట్రంలో ఉన్నారు
గురువు లేకుండా విలు విద్యను నేర్చుకున్న ఆదర్శవంతుడు ఏకలవ్యుడు
గిరిజనులకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి ఏకలవ్యుడు
గిరిజనులు పండించే కాఫీకి నేను ఎంతో ప్రాధాన్యత ఇచ్చాను
అరకు కాఫీ అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది
అరకు కాఫీకి ప్రధాని నరేంద్ర మోదీ బ్రాండ్ అంబాసిడర్
మైదానంలో నివసించే గిరిజనులు అందరికంటే వెనుకబడి ఉన్నారు
ఆదివాసి దినోత్సవం జరపాలని 2018లో జీవో జారీ చేశా: సీఎం చంద్రబాబు

-
2024-08-09T13:25:24+05:30
అలర్ట్‌గా ఉన్నాం: తెలంగాణ డీజీపీ
హైదరాబాద్: బంగ్లాదేశ్ పరిణామాలపై స్పందించిన తెలంగాణ డీజీపీ
బంగ్లాదేశ్ ఉద్రిక్తత పరిస్థితులపై హైదరాబాద్‌లో నిఘా పెట్టాం
సిటీలో ఉన్న బంగ్లాదేశీయులపై నిఘా ఉంచాం
హైదరాబాద్‌కి అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటాం
కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల ప్రకారం చర్యలు తీసుకుంటాం
ఎలాంటి పరిణామాలనైన ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సిద్ధంగా ఉంది
-
2024-08-09T12:44:25+05:30
వయనాడు విధ్వంసం
వయనాడు పునరుద్ధరణకు సెలబ్రిటీల విరాళం
ముందుకొచ్చిన 13 ఏళ్ల బాలిక
3 గంటలపాటు ఏకధాటిగా భరతనాట్యం
రూ.15 వేలు సేకరించి, సీఎం పినరయి విజయన్‌కు అందజేత
మిగతావారికి ఆదర్శంగా నిలిచిన బాలిక

-
2024-08-09T12:36:27+05:30
వైసీపీ విగ్రహ రాజకీయం
అమరావతి: విజయవాడలో వైసీపీ విగ్రహ రాజకీయం
స్వరాజ్ మైదాన్ అంబేద్కర్ న్యాయ మహాశిల్పంలో మాజీ సీఎం జగన్ పేరును తొలగించిన గుర్తు తెలియని వ్యక్తులు
ఎత్తైన విగ్రహంతోపాటు పెద్ద అక్షరాలతో జగన్ పేరు
ఆ పేరును గత రాత్రి తొలగించిన గుర్తు తెలియని వ్యక్తులు
జగన్ పేరును టీడీపీ తొలగించిందని బ్లూ మీడియా తెగ హడావుడి
తమకు సంబంధం లేదంటున్న టీడీపీ నేతలు
అంబేద్కర్ విగ్రహం తొలగించినట్టు వైసీపీ సొంత మీడియా హడావిడి.. టీడీపీ ఆగ్రహం
-
2024-08-09T12:32:01+05:30
సైబర్ నేరగాళ్ల బాధితులు ఎక్కువమంది చదువుకున్న వారే..
ప్రజల సేఫ్టీకి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది: డీజీపీ జితేందర్
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా చాలా కేసులు పరిష్కారం
ఏడాదిలో సైబర్ క్రైమ్ వల్ల డబులు కోల్పోయిన బాధితులకు రూ.150 కోట్లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇప్పించింది
హకథాన్‌లో దేశ, విదేశాల నుంచి 10 వేల మంది పాల్గొంటున్నారు
చదువుకున్న వాళ్ళే సైబర్ క్రైమ్ వేధింపులకు గురవుతున్నారు: సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్
70 శాతం సైబర్ క్రైమ్ బాధితులు చదువుకున్న వాళ్ళే
ఐటీ ఉద్యోగులే 56 శాతం సైబర్ క్రైమ్ బాధితులుగా ఉన్నారు
నిమిషానికి రెండు సైబర్ క్రైమ్ కేసులు నమోదు అవుతున్నాయి: ఐటీ ఎలక్ట్రానిక్స్ విభాగం డిప్యూటీ సెక్రటరీ భావేశ్ మిశ్రా
సైబర్ క్రైమ్ వేధింపులకు గురైనా కంప్లెయింట్ చేయడం లేదు
గతేడాది సైబర్ క్రైమ్ వల్ల 7,500 కోట్ల రూపాయలు లాస్ అయ్యారు.

-
2024-08-09T12:12:51+05:30
నో బెయిల్..!!
అమరావతి: సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్‌కు హైకోర్టులో చుక్కెదురు
ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు ధర్మాసనం
రఘురామ కృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు
తదుపరి విచారణ ఈ నెల20కి వాయిదా
రఘురామకు కస్టోడియల్‌లో గాయాలైనట్టు సుప్రీంకోర్టు అభిప్రాయ పడిందనే వాదనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు
మధ్యంతర ముందస్తు బయిల్ ఇవ్వటానికి నిరాకరణ
-
2024-08-09T12:03:45+05:30
చంద్రబాబు వల్లే ఏపీకి పరిశ్రమలు
కర్నూలు: సీబీఎన్ అనే బ్రాండ్‌తో ఏపీకి పరిశ్రమలు: మంత్రి టీజీ భరత్
గత ప్రభుత్వం డెస్టాయ్ తప్ప మరేమీ చేయలేదు
ఓర్వకల్లు రెడ్ జోన్‌లో ఉంది. అన్ని రకాల పరిశ్రమలు ఏర్పాటుకి అనుకూలం
టీడీపీ అధికారంలోకి రాగానే పక్క రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయి
జయరాజ్ స్టీల్ ప్లాంట్‌కు వైసీపీ ప్రభుత్వం సహకారం అందించలేదు.
-
2024-08-09T11:58:59+05:30
గిరిజనుల అభివృద్ధి కోసం..
అమరావతి: గిరిజనుల అభివృద్ధి కోసం ఐటీడీఏని ఎన్టీఆర్ స్థాపించారు:మంత్రి గుమ్మడి సంధ్యారాణి
ఐటీడీఏ ఏర్పాటైన తర్వాత గిరిజన సోదరులు, మహిళలు ఎలా ఉండాలనేది తెలిసింది
సజ్జలు, జొన్నలు, రాగులు లాంటి చిరుధాన్యాలు మాత్రమే గిరిజనులు తీసుకునేవారు.
రూ.2 కిలో బియ్యం ఇచ్చి వరి భోజనం పరిచయం చేసింది నందమూరి తారక రామారావు
గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థల్ని జగన్ మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారు
రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది గిరిజనులు ఇబ్బంది పడ్డారు
గిరిజనుల అభివృద్ధి కోసం లక్ష పాతికవేల ఎకరాలు ఇచ్చారు
గిరిజనులకు ఇచ్చిన భూముల్లో దళారులతో వైసీపీ నాయకులు గంజాయి పండించారు
గిరిజన పిల్లలను ప్రేరేపించి గంజాయి రవాణా కోసం వాడుకున్నారు
70 శాతం మంది గిరిజన పిల్లలు జైల్లో మగ్గిపోతున్నారు.
గంజాయి సూత్రధారులు మాత్రం బయటే ఉన్నారు: మంత్రి గుమ్మడి సంధ్యారాణి
-
2024-08-09T11:33:28+05:30
గిరిజనుల తేనె కొనుగోలు చేసిన సీఎం చంద్రబాబు
అమరావతి: ఆదివాసీల జీవనశైలికి సంబంధించిన పనిముట్లతో ప్రదర్శన
ఆసక్తిగా తిలకించిన ఏపీ సీఎం చంద్రబాబు
ఉత్పత్తులు, వాటి వివరాలను అడిగి తెలుసుకున్న చంద్రబాబు
అడవి నుంచి వచ్చే కొన్ని ఉత్పత్తులకు బ్రాండ్ ఫైవ్ స్టార్ హోటళ్లలో ఎక్కువ డిమాండ్ ఉంది
గిరిజనుల తేనె కొనుగోలు చేసిన చంద్రబాబు
గిరిజనులు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి: సీఎం చంద్రబాబు

-
2024-08-09T11:26:05+05:30
డప్పుకొట్టిన ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి: విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు
ఆదివాసి దినోత్సవ వేడుకలకు హాజరైన సీఎం చంద్రబాబు, మంత్రి గుమ్మడి సంధ్యారాణి
గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్న కళాకారులు
డప్పు తీసుకుని వాయించిన సీఎం చంద్రబాబు
గిరిజన, లంబాడి కళాకారులతో ముచ్చటించిన చంద్రబాబు
గిరిజన సంప్రదాయం కొమ్మ కోయ ధరించి కళాకారులతో జత కలిసిన చంద్రబాబు
గిరిజనలు ప్రదర్శించిన ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్న చంద్రబాబు
గిరిజనులు తయారు చేసిన కాఫీ తాగిన చంద్రబాబు
ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వసంత కృష్ణ ప్రసాద్, అధికారులతో కాఫీ తాగించిన చంద్రబాబు

-
2024-08-09T11:20:33+05:30
కేటీఆర్ కామెంట్స్
హైదరాబాద్: ప్రభుత్వ నిర్ణయం వల్ల హైదరాబాద్ ప్రజలకు తీరని నష్టం: కేటీఆర్
సుంకేసుల పంపు హౌస్ విషయంలో జరిగిన అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారు.
హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కోట్ల విజయ భాస్కర్ రెడ్డి హయాంలో ప్రాజెక్టు స్టార్ట్
ప్రాజెక్టు కోసం అప్పట్లో నల్లగొండ జిల్లాలో ఘర్షణలు.
చంద్రబాబు నాయుడు హయాంలో ఎలిమినేటి మాధవ రెడ్డి పేరుతో ప్రారంభం
రాజశేఖర్ రెడ్డి హయాంలో పేజ్ 1, పేజ్ 2 పేరుతో ప్రారంభం
ప్రజల అభిప్రాయం తీసుకున్న తరువాత సుంకేసుల ప్రాజెక్ట్‌ను కేసీఆర్ రీ స్టార్ట్ చేశారు.
నాగార్జున సాగర్‌లో డెడ్ స్టోరేజ్ ఉన్న హైదరాబాద్‌కు మంచి నీటి సరఫరా కోసం తీర్చిదిద్దాం.

-
2024-08-09T11:14:43+05:30
డయాలసిస్ యూనిట్లు ప్రారంభం
నెల్లూరు: జీజీహెచ్‌లో డయాలసిస్ యూనిట్లు ప్రారంభించిన మంత్రి సత్యకుమార్
లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆరు డయాలసిస్ యూనిట్లు ఇవ్వడం ఆనందంగా ఉంది.
ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది.
మెరుగైన వైద్యం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది.
దేశంలో రూ.3.40 కోట్ల మంది కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.
గత ఐదేళ్లలో వైద్య రంగాన్ని వైసీపీ ప్రభుత్వం అధోగతి పాలు చేసింది: ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్
-
2024-08-09T10:54:58+05:30
సుప్రీంకోర్టులో మనీశ్ సిసోడియాకు ఊరట
ఢిల్లీ: సుప్రీంకోర్టులో మనీశ్ సోడియాకు ఊరట
మనీశ్ సిసోడియాకు షరతులో కూడిన బెయిల్ మంజూరు
ఎక్సైజ్ పాలసీ కేసులో సిసోడియాకు బెయిల్
సీబీఐ, ఈడీ విడివిడిగా విచారించిన రెండు కేసుల్లో సిసోడియాకు బెయిల్
17 నెలల తర్వాత జైలు నుంచి బయటకు సిసోడియా
నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరు
ప్రతి సోమవారం దర్యాప్తు సంస్థ ముందు హాజరుకావాలని ఆదేశం

-
2024-08-09T10:31:53+05:30
షేక్ హసీనా మళ్లీ బంగ్లాదేశ్ వస్తారు..!!
ఢాకా: భారత్‌లో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా
భారత్‌లో తలదాచుకుంటున్న షేక్ హసీనా
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల రగడ ఉగ్రరూపం దాల్చడంతో ప్రధాని పదవికి రాజీనామా, భారత్‌లో ఆశ్రయం
బంగ్లాదేశ్‌లో కొలువుదీరిన ఆపద్ధర్మ ప్రభుత్వం
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మహ్మద్ యూనాస్
షేక్ హసీనా మళ్లీ బంగ్లాదేశ్ వస్తారని కుమారుడి సంచలన ప్రకటన
బంగ్లాదేశ్‌లో పరిస్థితి చక్కబడి, ఎన్నికలు జరిగితే వస్తారని స్పష్టీకరణ

-
2024-08-09T10:15:02+05:30
మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ తీర్పుపై ఉత్కంఠ
ఢిల్లీ: సుప్రీంకోర్టులో మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై తీర్పు.
తీర్పు వెలువరించనున్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె వి విశ్వనాథన్ ధర్మాసనం
ఆగస్టు 5, 6వ తేదీల్లో విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
సిసోడియా బెయిల్‌ను వ్యతిరేకించిన ఈడీ, సీబీఐ
సిసోడియా విచారణకు సహకరించడం లేదు, జాప్యం చేస్తున్నారు.
అనవసరపు పత్రాలను తనిఖీ చేయాలని కోరుతున్నారని సుప్రీంకోర్టుకు తెలిపిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఎస్వీ రాజు
సిసోడియాకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది, బెయిల్ ఇవ్వొద్దని సుప్రీంకోర్టును కోరిన ఈడీ, సీబీఐ
అవినీతి రహిత పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చి వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని వాదనల్లో తెలిపిన ఈడీ, సీబీఐ
గతేడాది అక్టోబర్ నుంచి తనపై ఉన్న కేసుల్లో ఎలాంటి పురోగతి లేదని, తనకు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన సిసోడియా
-
2024-08-09T10:11:06+05:30
మత్తడి పోస్తున్న పాకాల సరస్సు
వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్‌లో గల పాకాల సరస్సు
పాకాల సరస్సు చేరిన వరదనీరు, 30.4 అడుగులకు చేరిన నీటిమట్టం
మత్తడి పోస్తున్న పాకాల సరస్సు
ఇటు భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి ప్రవాహం
35.70 అడుగుల వద్ద 6,08,283 క్యూసెక్కుల నీటి ప్రవాహం
-
2024-08-09T10:06:56+05:30
గురుకుల పాఠశాలలో విషాదం..
జగిత్యాల జిల్లా: పెద్దపూర్ గురుకుల పాఠశాలలో మళ్ళీ కలకలం.
ఉదయం 5 గంటలకు అస్వస్థతకు గురైన బాలుడు.
కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
అక్కడి నుంచి జగిత్యాల జిల్లా ఆసుపత్రికి తరలింపు. చికిత్స పొందుతూ బాలుడి మృతి.
మృతి చెందిన బాలుడు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అనిరుద్‌గా గుర్తింపు.
మరో విద్యార్ధి మొక్షిత్‌కు ఆస్వస్థత, ఆసుపత్రికి తరలింపు.
-
2024-08-09T10:00:36+05:30
అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం
ఇంటర్నేషనల్ ట్రైబల్ డే సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
స్వచ్ఛమైన మనస్సులు, ప్రకృతిని ప్రేమించే మనుషులు, సమాజానికి ప్రకృతి సంపద పంచడమే తప్ప ఏమి ఆశించిన ఆదివాసీల వ్యక్తిత్వం నిత్య స్పూర్తి అంటూ లోకేశ్ ట్వీట్
ట్వీట్ చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
-
2024-08-09T09:53:32+05:30
శ్రావణ శోభ
విశాఖపట్టణం: అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ
శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతో అమ్మవారి సేవలో మహిళలు
శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు
శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన, సామూహిక వరలక్ష్మి వ్రతాలు
అమ్మవారిని సందర్శించుకుంటున్న భక్తులు
భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు

-
2024-08-09T09:48:57+05:30
వైసీపీని వీడేది లేదు: ఆనం విజయ్
నెల్లూరు: జడ్పీ సమావేశానికి ఆహ్వానించేందుకు మంత్రి నారాయణని కలిశాం.
జడ్పీ చైర్మన్ పదవిని వైసీపీ ఇచ్చింది. ఆ పార్టీని వీడేది లేదు.
రాజకీయాలకి అతీతంగా జిల్లా అభివృద్దికి తోడ్పడుతాం: జెడ్పీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి దంపతులు
-
2024-08-09T09:04:04+05:30
కాంగ్రెస్ వాయిదా తీర్మానం
ఢిల్లీ: లోక్ సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం.
రెజ్లర్ వినేశ్ ఫోగట్ అనార్హత అంశంపై చర్చించాలని వాయిదా తీర్మానం.
-
2024-08-09T09:02:50+05:30
కీలక నిర్ణయలు తీసుకునే అవకాశం..!!
ఢిల్లీ: సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం.
పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
బంగ్లాదేశ్‌లో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ప్రాధాన్యం

-
2024-08-09T08:58:17+05:30
వైసీపీకి భారీ షాక్..?
నెల్లూరు: టీడీపీలోకి జోరుగా వలసలు
మంత్రి నారాయణ నివాసానికి చేరుకున్న వైసీపీ జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ దంపతులు
మంత్రి నారాయణతో ఆనం అరుణమ్మ, ఆమె భర్త విజయకుమార్ రెడ్డి భేటీ
ఆనం విజయకుమార్ రెడ్డి వెళ్లడంపై ప్రాధాన్యం
టీడీపీలో చేరేందుకే మంత్రి నారాయణ నివాసానికి వెళ్లారనే చర్చ.
ఆనం విజయకుమార్ రెడ్డి దంపతులు టీడీపీలో చేరితే జగన్ పార్టీకి కోలుకోలేని దెబ్బే..!!
రేపు (శనివారం) జరిగే జెడ్పీ సమావేశానికి ఆహ్వానించడానికి వెళ్లారంటోన్న వైసీపీ శ్రేణులు
-
2024-08-09T08:51:21+05:30
అభినందనలు
బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా మహ్మద్ యూనస్ బాధ్యతలు
అభినందనలు తెలియజేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ
బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనార్టీల రక్షణకు చర్యలు తీసుకోండి.
బంగ్లాదేశ్‌తో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధం : ప్రధాని మోదీ

-
2024-08-09T08:45:16+05:30
సీబీఐ చార్జిషీట్‌పై నేడు విచారణ
ఢిల్లీ: లిక్కర్ కేసు సీబీఐ చార్జిషీట్‌పై నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ
కవితతో పాటు ఇతర నిందితులు వర్చువల్‌గా హాజరు
ఢిల్లీ లిక్కర్ సీబీఐ కేసులో A17గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
ప్రస్తుతం తీహార్ జైలులో కవిత.

-
2024-08-09T07:48:50+05:30
అర్షద్ నదీమ్ కూడా మన బిడ్డే: నీరజ్ తల్లి
ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో అర్షద్‌కు గోల్డ్ మెడల్
పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించిన అర్షద్ నదీమ్
జావెలిన్ త్రోలో సెకండ్ ప్లేస్‌లో నిలిచిన నీరజ్ చోప్రా
అభిమానుల హృదయాలను గెలుచుకున్న నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి

-
2024-08-09T07:43:35+05:30
ఎస్సైల బదిలీలు
కడప జిల్లాలో భారీగా ఎస్సైల బదిలీలు
63 మంది ట్రాన్స్‌ఫర్
-
2024-08-09T07:41:00+05:30
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ డ్రామా
శ్రీకాకుళం: టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా.
కొంతకాలంగా దువ్వాడ దంపతుల మధ్య విబేధాలు.
కుటుంబానికి దూరంగా ఉంటున్న ఎమ్మెల్సీ దువ్వాడ.
నిన్న సాయంత్రం తండ్రిని కలువటానికి వచ్చిన కుమార్తెలు, ఇంట్లోకి అనుమతించని దువ్వాడ.
అర్ధరాత్రి వరకు తండ్రి పిలుపు కోసం వేచి చూసి వెనుతిరిగిన కుమార్తెలు.
దువ్వాడ వ్యవహారంపై టెక్కలిలో రకరకాల చర్చలు.
-
2024-08-09T07:36:26+05:30
బెయిల్ వచ్చేనా..?
ఢిల్లీ: లిక్కర్ కేసులో మనీష్ సిసోడియా బెయిల్ పాటిషన్‌పై తీర్పు వెల్లడించనున్న సుప్రీంకోర్టు.
గత ఏడాది ఫిబ్రవరి 26వ తేదిన ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న మనీష్ సిసోడియా.
-
2024-08-09T07:33:52+05:30
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు
అమరావతి: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధన్యవాదాలు
ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారని వెల్లడి
బిజీ షెడ్యూల్‌లో విలువైన సమయాన్ని నా కోసం వెచ్చించారు
మీరు, మీ ప్రభుత్వ బృందం అందించిన సహకారాన్ని మరవలేం
-
2024-08-09T07:27:00+05:30
అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ
అమెరికా పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
గూగుల్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ
స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో బయో డిజైన్ సెంటర్‌లో సస్టెనబిలిటీ డీన్ అరుణ్ మజుందార్, ప్రొఫెసర్ రాజ్ దత్‌తో చర్చలు
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, తగిన అవకాశాలు కల్పిస్తామని హామీ
సీఎం రేవంత్ రెడ్డితో పాటు అమెరికా పర్యటనలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి

-
2024-08-09T07:20:02+05:30
భారీగా తగ్గిన బంగారం ధర
గత మూడు రోజుల నుంచి తగ్గుముఖం
రెండురోజుల్లో 10 గ్రాముల బంగారంపై రూ.1300 తగ్గుదల
శుక్రవారం మరో రూ.100 తగ్గింపు
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,490
మేలిమి బంగారం ధర రూ.69,260
విశాఖపట్టణం, విజయవాడలో ఇవే ధరలు

-
2024-08-09T07:15:46+05:30
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.