Share News

Lok Sabha Polls 2024: అది జరక్కపోతే బీజేపీకి 180 సీట్లకు మించి రావు: ప్రియాంక

ABN , Publish Date - Apr 17 , 2024 | 07:05 PM

లోక్‌సభ ఎన్నికల వేళ ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రస్తావించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ లేకుండా దేశంగా స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరిగితే బీజేపీకి 180కి మించి సీట్లు రావని అన్నారు.

Lok Sabha Polls 2024: అది జరక్కపోతే బీజేపీకి 180 సీట్లకు మించి రావు: ప్రియాంక

షహరాన్‌పూర్: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ ఈవీఎంల ట్యాంపరింగ్ (EVMs Tampering) అంశాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) ప్రస్తావించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ లేకుండా దేశంగా స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరిగితే బీజేపీకి 180కి మించి సీట్లు రావని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రియాంక మాట్లాడుతూ, ఏ ఆధారంతో 400కు పైగా సీట్లు గెలుస్తామని బీజేపీ చెబుతోందని ప్రశ్నించారు.


''వాళ్లేమైనా జ్యోతిష్యులా? ఏ ఆధారంతో 400కు పైగా సీట్లు గెలుస్తామని అంటున్నారు? వాళ్లు ఇంతకుముందు ఏదైనా చేసి ఉండాలి. లేదంటే 400 సీట్లు వస్తాయని ఎలా ఢంకా బజాయిస్తున్నారు? ఈరోజు దేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్ లేకుండా ఎన్నికలు జరిగితే వాళ్లకు (బీజేపీ) 180కు మించి సీట్లు రావని నేను ధీమాగా చెప్పగలను. నిజానికి 180 కంటే తక్కువ సీట్లే వాళ్లకు వస్తాయి'' అని ప్రియాంక గాంధీ అన్నారు.

Lok Sabha Elections: కేంద్ర ఏజెన్సీల ద్వారా ఫోన్ల ట్యాపింగ్.. ఈసీకి డీఎంకే ఫిర్యాదు


ప్రజలు మార్పు కోరుకుంటున్నారు...

ప్రజలు మార్పుకోరుకుంటున్నారని, ఈతరహా రాజకీయాలను ఆశించడం లేదని ప్రియాంక గాంధీ అన్నారు. పదేళ్లుగా సామాన్య ప్రజానీకం, మహిళల జీవితాల్లో ఎలాంటి అభివృద్ధి లేదని, ఉద్యోగాలు లేవని, ధరలు కిందకు దిగడం లేదని అన్నారు. ఇది పండుగల సీజన్ అయినప్పటికీ, ఈరోజు రామనవమి చేసుకుంటున్నప్పటికీ ప్రజలకు దగ్గర ఏది కొనాలన్నా డబ్బులు లేవన్నారు. ''ఆయన (ప్రధాని) నిరుద్యోగం గురించి మాట్లాడరు. ద్రవ్యోల్బణం ఊసెత్తరు. ఆయన చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఆయనకు ఈ విషయం చెప్పరు. ప్రజల నుంచి ఆయన దూరంగా జరిగారు'' అని ప్రియాంక వ్యాఖ్యానించారు. షహరాన్‌పూర్ ప్రజల నుంచి తమకు వస్తున్న అనూహ్య స్పందన దిగ్భ్రాంతిని కలిగిస్తోందని, ప్రజలకు అన్యాయం చేసిన బీజేపీకి ఉద్వాసన తప్పదని అన్నారు. షహరాన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఏప్రిల్ 19న ఎన్నిక జరుగనుండగా, కాంగ్రెస్ అభ్యర్థిగా ఇమ్రాన్ మసూద్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ రాఘవ్ లఖన్‌పూర్ తిరిగి ఆ పార్టీ టిక్కెట్‌పై బరిలో ఉన్నారు.

జాతీయ వార్తలు కోసం..

Updated Date - Apr 17 , 2024 | 07:05 PM