Share News

BJP candidate: ఆ రోలెక్స్‌ వాచ్‌ బిల్లు ఎక్కడుందో చెబుతారా..?

ABN , Publish Date - Apr 10 , 2024 | 11:46 AM

తనకు కేవలం లక్షన్నర రూపాయల కారు మాత్రమే ఉందని చెబుతున్న దయానిధి.. మరి చేతికి రూ.45 లక్షల విలువైన రోలెక్స్‌ వాచీ ఎలా ధరిస్తున్నారో చెప్పాలని సెంట్రల్‌ చెన్నై బీజేపీ అభ్యర్థి వినోజ్‌ పి.సెల్వం(BJP candidate Vinoj P. Selvam) ప్రశ్నించారు.

BJP candidate: ఆ రోలెక్స్‌ వాచ్‌ బిల్లు ఎక్కడుందో చెబుతారా..?

- దయానిధికి వినోజ్‌ పి.సెల్వం సూటి ప్రశ్న

చెన్నై: తనకు కేవలం లక్షన్నర రూపాయల కారు మాత్రమే ఉందని చెబుతున్న దయానిధి.. మరి చేతికి రూ.45 లక్షల విలువైన రోలెక్స్‌ వాచీ ఎలా ధరిస్తున్నారో చెప్పాలని సెంట్రల్‌ చెన్నై బీజేపీ అభ్యర్థి వినోజ్‌ పి.సెల్వం(BJP candidate Vinoj P. Selvam) ప్రశ్నించారు. బుధవారం ఆయన నియోజకవర్గంలో విస్త్రత ప్రచారం చేపట్టారు. ప్రధానమంత్రి మోదీ(Prime Minister Modi) రోడ్‌షోకు ముందే ఇంటింటి ప్రచారం చేపట్టిన వినోజ్‌ మీడియాతో మాట్లాడుతూ.. దయానిధి మారన్‌ నిరుపేద అని, ఆయన వద్ద కేవలం లక్షన్నర రూపాయల విలువైన కారు మాత్రమే వుందని ఎద్దేవా చేశారు. మరి అంత ఖరీదైన వాచ్చీ ఎలా వచ్చిందో, దాని రశీదు ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. ఆయన నామినేషన్‌ పత్రాల్లో పేర్కొన్న ఆస్తుల వివరాలను బయటకు తీయబోతున్నామన్నారు. ఏనాడూ నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకోని దయానిధి.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడిగేందుకు వస్తున్నారో చెప్పాలన్నారు. ఎంతోమందికి గృహాల్లేవని, మంచినీరు కూడా దొరకడం లేదన్నారు. మరి ఇన్నాళ్లుగా నియోజకవర్గానికి దయానిధి ఏం చేశారో చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రంగాల్లోనూ విఫలమైందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదని విమర్శించారు.

nani7.jpg

ఇదికూడా చదవండి: BJP candidate: ఆమె కేరాఫ్‌ తీహార్‌ జైలు... నా అడ్రస్‌ రాజ్‌భవన్‌

Updated Date - Apr 10 , 2024 | 11:46 AM