Share News

Bihar Political crisis: బలపరీక్ష నెగ్గిన నితీష్ కుమార్.. ఎంతమంది సపోర్ట్ ఇచ్చారంటే..

ABN , Publish Date - Feb 12 , 2024 | 03:55 PM

Bihar Political crisis: బీహార్ అసెంబ్లీ బలపరీక్షలో నితీష్ కుమార్ నెగ్గారు. నితీష్ కుమార్‌కు మద్దతుగా 129 మంది శాసనసభ్యులు ఓటు వేశారు. అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలుండగా.. మ్యాజిక్ ఫిగర్ 122 సీట్స్ కావాలి. అయితే, నితీష్ వర్గం కుట్ర చేస్తుందని ఆరోపిస్తూ విపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.

Bihar Political crisis: బలపరీక్ష నెగ్గిన నితీష్ కుమార్.. ఎంతమంది సపోర్ట్ ఇచ్చారంటే..
Bihar CM Nitish Kumar

Bihar Political crisis: బీహార్ అసెంబ్లీ బలపరీక్షలో నితీష్ కుమార్ నెగ్గారు. నితీష్ కుమార్‌కు మద్దతుగా 129 మంది శాసనసభ్యులు ఓటు వేశారు. అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలుండగా.. మ్యాజిక్ ఫిగర్ 122 సీట్స్ కావాలి. అయితే, నితీష్ వర్గం కుట్ర చేస్తుందని ఆరోపిస్తూ విపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. సభలో ఉన్న 129 మంది సభ్యులు నితీష్‌కు మద్దతుగా ఓటు వేశారు. దీంతో అవిశ్వాస తీర్మానంలో నితీష్ సర్కార్ నెగ్గింది.

బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్.. ఇంతకాలం కలిసి ఉన్న మహాఘట్‌బంధన్‌కు గుడ్ బై చెప్పి ఎన్డీయే కూటమిలో చేరిన విషయం తెలిసిందే. బీజేపీ సపోర్ట్‌తో బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు నితీష్ కుమార్. ఈ క్రమంలో సోమవారం నాడు బీహార్ అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో అందరూ అనుకున్నట్లుగానే నితీష్ కుమార్ నెగ్గారు. నితీష్‌కు సపోర్ట్‌గా 129 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ముందుగా వాయిస్ ఓటింగ్ నిర్వహించారు.. ఆ తరువాత వారి ఓట్లను లెక్కించారు. ఈ ఓటింగ్‌లో నితీష్ సర్కార్ నెగ్గినట్లు అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు.

నితీష్‌కు అనుకూలంగా ఆర్జేడీ ఎమ్మెల్యేల ఓటింగ్..

కాగా, నితీష్ కుమార్‌కు అనుకూలంగా ఐదుగురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఆర్జేడీ జారీ చేసిన విప్‌ను ధిక్కరించి మరీ నితీష్‌ కుమార్‌కు అనుకూలంగా ఓటు వేశారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. దీంతో అధికారపక్షం తమ ఎమ్మెల్యేలను బలవంతంగా లొంగదీసుకుందని ఆరోపిస్తూ ఆర్జేడీ, కాంగ్రెస్ సహా విపక్ష నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు.

Updated Date - Feb 12 , 2024 | 04:13 PM